-రేపు జరిగే స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం నిర్వహణపై దిశానిర్ధేశం చేసిన మంత్రి
-ఈనెల ఇ – చెక్ అనే థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలి
-షాపులు ,ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ ను పూర్తిగా సేకరించాలి
-మున్సిపాలిటీల్లో ఉన్న RRR సెంటర్లను ఈ కలెక్షన్ సెంటర్లుగా మార్చి మెప్మా మహిళలకు అప్పగించాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు జరిగే స్వచ్చాంధ్ర – ప్వచ్చ దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు…ప్రతి నెలా మూడో శనివారం జరిగే స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమంపై మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు…ఈ టెలికాన్ఫరెన్స్ కు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,స్వచ్చాంధ్ర ఎండీ అనిల్ కుమార్ రెడ్డి,చైర్మన్ పట్టాభిరామ్ తో పాటు అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు హాజరయ్యారు..కార్యక్రమం నిర్వహణ,చేయాల్సిన ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ దిశానిర్ధేశం చేసారు.
*ఈనెల థీమ్ – ఇ చెక్.
ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెలా మూడో శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది..ఒక్కో నెల ఒక్కో థీమ్ తో పన్నెండు నెలల పాటు క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా రాష్ట్రఆన్ని వందశాతం స్వచ్చతగా మార్చాలనేది సీఎం లక్ష్యం అని మంత్రి నారాయణ చెప్పారు…ఇప్పటికే మూడు నెలలు పూర్తికాగా ఈనెల అంటే 19 వ తేదీ శనివారం ఇ-చెక్ అనే థీమ్ తో కార్యక్రమం నిర్వహించాలని మంత్రి సూచించారు…వరుసగా మూడు నెలల పాటు సీఎం చంద్రబాబు ఏదో ఒక జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో కేవలం మున్సిపల్ కమిషనర్లు మాత్రమే కాకుండా అన్ని శాఖల అధికారులను,ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు..స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమం విజయవంతం అయ్యేలా తీసుకోవల్సిన చర్యలపై మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేసారు.
ఇ- చెక్ అంటే అన్ని మున్సిపాల్టీలు,గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లు,దుకాణాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను పూర్తిగా సేకరించి రీయూజ్ చేయడం.దీనికోసం మున్సిపాల్టీల్లో ప్రత్యేకంగా కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు..ఇప్పటికే మున్సిపాల్టీల్లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సెంటర్లను ఇ-వేస్ట్ కలెక్షన్ సెంటర్లుగా మార్చనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు….ఈ సెంటర్లలో ఇ-వేస్ట్ ను సేకరించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు…ఇళ్లు,దుకాణాల్లో ఉన్న పాడైపోయిన మొబైల్ ఫోన్లు,టీవీలు,ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఇ-వేస్ట్ కలెక్షన్ సెంటర్లలో ఇవ్వడం ద్వారా వారికి తగినంత నగదు కూడా చెల్లిస్తారు..ఇదే సమయంలో మహిళలకు కూడా ఉపాధి కలగనుంది…రాష్ట్రవ్యాప్తంగా మున్పిపాల్టీల్లో మొత్తం 222 ఇ-వేస్ట్ కలెక్షన్ సెంటర్లు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి చెప్పారు…స్థానికంగా ఉండే మహిళా సంఘాల్లోని సభ్యులు కూడా ఇ-వేస్ట్ సేకరించేలా అవకాశం ఉంటుంది…ఇలా సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను రీయూజ్ చేసేందుకు ఉపయోగించేలా పలు కంపెనీలు ముందుకొస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
ఈ కార్యక్రమం శనివారం ఒక్క రోజు మాత్రమే కాకుండా ఇ- వేస్ట్ తొలగింపునకు నిత్యం అందుబాటులో కలెక్షన్ సెంటర్లు ఉండేలా ఏర్పాట్లు చేసామన్నారు.
శనివారం నుంచి జరిగే ఇ-వేస్ట్ కలెక్షన్ కోసం మున్సిపల్ కమిషనర్లు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని విజయవంతం చేయాలని మంత్రి నారాయణ సూచించారు.రేపు నెల్లూరులో స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమంలో మంత్రి పాల్గోనున్నారు.
Prajavartha Online Telugu News