నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దెందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర విద్య శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. స్థానిక ఎమ్మార్ ఏ ఆర్ పీజీ కేంద్రంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అకాడమిక్ బ్లాక్ నిర్మాణపనులకు బుధవారం మంత్రి శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దెందుకు విద్య వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రాధమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి విద్య విధానం వరకు సంస్కరణలు అమలు జరుగుతున్నాయన్నారు. అమ్మఒడి పధకం ద్వారా ప్రతీ ఒక్కరూ పాఠశాలకు తీసుకువస్తున్నామన్నారు. ఆత్మనూన్యత పోగొట్టి, ఆత్మస్థైర్యం పెంపొందించేలా ఉన్నత విద్య అవకాశాలను జగనన్న విద్య కానుక, వసతి కానుక ద్వారా కల్పించామన్నారు. పాఠశాలల్లో పుస్తకాలు, కిట్లు , యూనిఫామ్ లు ఉచితంగా అందిస్తున్నామని, జగనన్న గోరుముద్ద పధకం కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. మన బడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అభ్యసించే పరిస్థితులు కల్పించామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, 3వ సంవత్సరాల వయస్సు నుండే ఎల్.కె.జి, అనంతరం యు.కె.జి విద్య బోధనా చేస్తున్నామన్నారు. 6 సంవత్సరాల వయస్సులోనే 88 శాతం బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుందన్న శాస్త్రీయ ఆధారాలతో పిల్లలకు ఫౌండేషన్ కోర్సులు అందిస్తున్నామన్నారు. డిగ్రీ అనంతరం ఇంటర్న్ షిప్ తప్పనిసరి చేస్తామని, ఉపాధి అవకాశాలకు డిమాండ్ ఉన్న విభాగాలలో వైపుణ్యం పెంపొందించుకునే విధంగా కోర్సులు అందిస్తామన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయన్నారు. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉందని, ప్రస్తుమం ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలకు డిమాండ్ ఉన్న కోర్సుల పై ప్రత్యేక దృష్టి కేంద్రకరించామన్నారు. ఎమ్మార్ ఏ ఆర్ పీజీ కేంద్రంను కృష్ణా యూనివర్సిటీ కి ధీటుగా అటానమస్ కేంద్రంగా అభివృద్ధి చేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే కోర్సులను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. .
శాసన సభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు ప్రాంతాన్ని విద్యాభివృద్ధి కేంద్రం అభివృద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి నూజివీడు ప్రాంతానికి త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేశారన్నారు. అంతే కాక ఇంజనీరింగ్ కాలేజీలు, బి.ఎడ్., పాలిటెక్నిక్ , పీ.జీ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు. నూజివీడు లో ఉన్నత విద్య అభ్యసించిన అమెరికాలోని వాషింగ్టన్ డిసి లో స్థిరపడినవారు అక్కడ ” నూజివీడు క్లబ్ ” ను ఏర్పాటు చేయడం విషయమన్నారు. ఎమ్మార్ ఏ ఆర్ పీజీ కేంద్రంలో ఆడిటోరియం నిర్మించవలసిందిగా మంత్రిని కోరారు.
కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె. పి . చంద్రశేఖర్, రిజిస్ట్రార్ వై.కె. సుందర కృష్ణ, ఆర్డీఓ కే. రాజ్యలక్ష్మి, డీఈఓ తాహెరా సుల్తానా, సర్వ శిక్షా అభయం ఏ పి సి లక్ష్మి దుర్గ ,డిప్యూటీ డీఈఓ కమలకుమారి, మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, వైస్ చైర్మన్, పగడాల సత్యనారాయణ, పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ సి.ఎం. వినయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు , ప్రభృతులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమవారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …