కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంకా జగనన్న కాలనీల్లోని లేఅవట్లలో అవసరమైన చోట్ల త్వరత గతిన మెరక పనులు చేపట్టాలని ఎన్ఆర్ఇజీఎస్ అధికారులు శాసనసభ్యు దూలం నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం శాసనసభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఇళ్ల నిర్మాణ మెరక పనుల పై నాలుగు మండలాల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ఏపీఓలతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని వైఎస్. జగనన్న నూతన లే అవుట్ లలో మట్టి పూడిక పనులు, మరియు వాటి యొక్క పెండింగ్ పేమెంట్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జగనన్న ఇచ్చిన కాలనీలలో 6 అడుగుల ఎత్తు మట్టి పూడిక పూర్తిగా చేయాలని, ప్రతి లే అవుట్ లో కూడా మట్టి పూడిక చాలా ముఖ్యమన్నారు. ఇంకా ఎక్కడైనా మట్టి పూడిక జరగకపోతే త్వరగతిన పూడిక చేయాలని అన్నారు. అదేవిదంగా పూడిక చేసిన కాంట్రాక్టర్ లకు రావాల్సిన, బిల్లులు వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం, ఏపీవోలు చరణ్, ఆనంద్, దేవానందరాజు తదితరులు పాల్గొన్నారు.
![](https://prajavartha.com/wp-content/uploads/2021/08/4-12.jpeg)