విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), విశాఖపట్నం ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాలతాంబ విద్యానికేతన్లో ప్రీ-ఈవెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూన్ 21, 2025న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమానికి ఇది ముందస్తు ప్రారంభంగా నిలిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజేందర్ చౌదరి, ఐఐఎస్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ (రీజియన్), ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అనేది భారత దేశం నుండి ప్రపంచానికి అందించిన విలువైన సంపద అని ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు పునాది వేసే ప్రక్రియ అని అన్నారు. యువతలో ఆరోగ్యవంతమైన జీవనశైలికి, అభివృద్ధికి యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో “సమతుల్య జీవనం కోసం యోగా” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ప్రొఫెషనల్ యోగా శిక్షకుల నేతృత్వంలో ప్రత్యక్ష యోగా ప్రదర్శనని నిర్వహించారు. పాల్గొన్న విద్యార్థులకు సీబీసీ తరఫున టీ-షర్టులు, యోగా సంబంధిత పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
సమగ్ర ఆరోగ్యం, శాంతి, సామాజిక ఐక్యతకు యోగా దోహదపడుతుందన్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్థావిస్తూ, యువతను యోగాభ్యాసం వైపు ప్రోత్సహించడంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంకల్పాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.
శ్రీరామ మూర్తి కందాళ, ఐఐఎస్, ఎఫ్పీవో – సీబీసీ విశాఖపట్నం, సునీల్ మహంతి (కరస్పాండెంట్), డా. జీపీఆర్ కృష్ణ (జనరల్ మేనేజర్, మాలతాంబ విద్యానికేతన్), విద్యార్థులు, అధ్యాపకులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News