Breaking News

విశాఖలో యోగాంధ్ర ఏర్పాట్లు పరిశీలించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు 

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నంలో గీతం యూనివర్శిటీ క్రికెట్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు IAS., పరిశీలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21 విశాఖపట్నం ప్రధాన వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పాఠశాల విద్యశాఖకు సంబంధించి గీతం యూనివర్శిటీ క్రికెట్ మైదానం కేటాయించారని, విద్యాశాఖ నుండి దాదాపు 10 వేల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., తెలిపారు. ఎస్పీడీ తో పాటు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి , జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *