Breaking News

అన్నా క్యాంటీన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

-ప్రజల సంతృప్తితే లక్ష్యం
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాత్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నిర్వహణ విషయంలో ఏజెన్సీ, ఆర్ ఎమ్ సి అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకు ఆహరం పంపిణీ చేసే విధానంలో అన్నా క్యాంటీన్ లని నిర్వహిస్తూన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు రోజూ ఐదు రూపాయలకే ఆహారం అందించే విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. సమయానికి ప్రజలకు ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రుచికరమైన ఆహారం అందించడంతో పాటు క్యాంటీన్ల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రజలకు అనుకూలమైన సమయాల్లో ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. అన్నా క్యాంటీన్ నిర్వహణలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, వాటికి అనుగుణంగా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతోంది. ప్రజల సంతృప్తి స్థాయి 80 నుంచి 95 శాతం మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. పొడగట్ల పల్లె నుంచి నగరంలోని మూడు క్యాంటీన్ లకు, కొవ్వూరు కి ఆహారం సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంలో కలెక్టర్ వెంట అదనపు మునిసిపల్ కమిషనర్ ఆర్ వి రామలింగేశ్వర్ , ఈ ఈ మదర్సా ఆలీ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *