Breaking News

“ఒక చెట్టు తల్లి పేరుతో” కార్యక్రమం – పచ్చదనంతో తల్లికి గౌరవం

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
యువ వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన “మేరా యువ భారత్” (My Bharat) సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన “ఒక చెట్టు తల్లి పేరుతో” కార్యక్రమాన్నిబుధ‌వారం వికాస్ జూనియర్ కాలేజ్, ముదినేపల్లి మండలం, మడవల్లి బ్లాక్, ఏలూరు లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తల్లుల పట్ల ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరచడం మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమం ద్వారా యువత ఒక చెట్టును తల్లి పేరుతో నాటి, భూమాతను కాపాడే బాధ్యతను తీసుకోవాలనే సందేశాన్ని విస్తృతంగా పరిచారు. ఈ కార్యక్రమంలో వన శాఖ సహకారంతో 100 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. స్థానిక యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ అవగాహన, తల్లుల పట్ల గౌరవం, హరితవనం పెంపు వంటి అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మేరా యువ భారత్ వాలంటీర్స్ కె. ప్రసన్న దత్త మరియు కె. జగదీష్ విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు: వీరబద్రరావు, సబ్ ఇన్‌స్పెక్టర్, రమేశ్, పంచాయతీ కార్యదర్శి, ప్రియాంక, వ్యవసాయ సహాయకురాలు, జి. మదన్ కిషోర్, కాలేజ్ కారస్పాండెంట్, ఎ. కిషోర్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, రామ్ మోహన్, ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రిన్సిపల్, సుబ్బారావు మరియు కళాశాల సిబ్బంది, హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *