Breaking News

మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా 18 నుంచి 45 లోపు వయస్సు గల వారందరికీ వ్యాక్సిన్ వేయాలి…

-వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు పక్కాగా ఆన్ లైన్ లో నమోదు చెయ్యాలి..
-పాఠశాల విద్యార్ధులతో కలసి భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేసిన ఆర్డీవో ఖాజావలి
-ఆర్డీవో(పూఅభా) ఎన్.ఎస్.కె. ఖాజావలి

గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ నియంత్రణే లక్ష్యంగా డివిజన్ పరిధిలో 18 నుండి 45 సం.రం.ల వయస్సు గల వారందరకీ వ్యాక్సిన్ వేసి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చెయ్యాలని ఆర్డీవో(పూ.అ.భా) ఎన్.ఎస్.కె. ఖాజావలి అన్నారు. మంగళవారం గుడ్లవల్లేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆర్డీవో ఖాజావలి అధికారులతో కలసి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణే లక్ష్యంగా డివిజన్ పరిధిలో 18 నుంచి 45 ఏళ్లు లోపు గల వారిందరికీ సచివాలయాలు ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ మోతాదులను ప్రత్యేక కాంపైన్ ద్వారా అందిస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలో ప్రతి సచివాలయానికి 200 చొప్పున కోవిడ్ వ్యాక్సినేషన్ మోతాదులను అందించామన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఆశా, వాలంటీర్లు, ఏఎన్ఎంలు సమన్వయంతో పనిచేస్తూ ఆయా సచివాలయాలపరిధిలోని 18 నుంచి 45 ఏళ్లు లోపు గల వారిందరికీ వ్యాక్సినేషన్ అందించాలన్నారు. సెంకండ్ డోస్ కొరకు వ్యాక్సిన్ మిగల్చవద్దని వచ్చిన అందరికీ వ్యాక్సిన్ వేసి లక్ష్యాలను పూర్తి చెయ్యాలన్నారు. ఈ సందర్బంగా వాక్సినేషన్ డేటా ఎంట్రి ప్రక్రియను పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి డిజిటల్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లు డేటా ఎంట్రీని పక్కాగా ఆన్ లైన్ లో నమోదు చెయ్యాలన్నారు.
జగనన్న గోరు ముద్ద పథకాన్ని పరిశీలించిన : ఆర్డీవో ఖాజావలి
అనంతరం ఆర్డీవో ఖాజావలి గుడ్లవల్లేరు ప్రాధమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి మద్యనే నేలపై కూర్చోని భోజనం చేసి మధ్యాహ్నం భోజనం యొక్క నాణ్యాతా ప్రమాణాలను గుర్తించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాలయులతో మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి రోజు ప్రభుత్వం నిర్థేశించిన మెనూ ప్రకారం భోజనం పెడుతున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ నాడు – నేడు ద్వారా పాఠశాలలు ఆధునీకరణ, మౌలిక సదుపాయాలు కల్పన, జగనన్న కానుక వంటి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తుందన్నారు. విద్యార్థులకు ప్రాధమిక దశ నుంచే మెరుగైన విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సి బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందని ఆయన అన్నారు. విద్యార్థులు కోవిడ్ భారిన పడకుండా ప్రభుత్వం నిర్థేశించిన కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఉపాధ్యాలకు సూచించారు. ఆర్డీవో వెంట పీహెచ్ వైద్యురాలు డా. రీనా మాధురి, యంపీడీవో కె.మణికుమార్, తాహశీల్థార్ (ఇంఛార్జి) బి.కనకదుర్గ, ఆర్ ఐ. అక్భర్ ఖాన్, వీఆర్వోలు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *