Breaking News

గూడివాడ PACS శిక్షణ కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ అంటే కృష్ణా జిల్లా – కృష్ణా జిల్లా అంటే గుడివాడ వ్యవసాయానికి పుట్టింది పేరు గుడివాడ. ఈ నేల రైతు స్ఫూర్తి, సహకార శక్తి, అభివృద్ధికి పునాది అని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్  నెట్టెం రఘురాం అన్నారు. గుడివాడ లో నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ కైకలూరు పామర్రు గన్నవరం నియోజకవర్గానికి చెందిన 90 PACS అధ్యక్షులు, డైరెక్టర్లు, పాల్గొని సహకార రంగ బలోపేతానికి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రైతే దేశానికి అన్నదాత” అన్న మహానేత నందమూరి తారక రామారావు స్ఫూర్తి సహకార రంగానికి పునాది. ఆయన కలల్ని నెరవేర్చడమే టిడిపి ప్రధాన ధ్యేయమని రఘురాం పేర్కొన్నారు.ఈ నేల మీద పుట్టి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి రైతు సంక్షేమానికి మార్గదర్శకమైందని ఆయన అన్నారు. PACS, సహకార బ్యాంకుల అభివృద్ధికి ఆయన రూపకల్పన చేసిన విధానాలు భవిష్యత్తులో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అవుతాయని చెప్పారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీ, పోరాటపటిమ రైతు, యువత, కార్మికులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని రఘురాం అభినందించారు. దేశవ్యాప్తంగా సహకార రంగాన్ని పునరుజ్జీవింపజేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృషి PACSలకు దిక్సూచి అవుతోందని ఆయన గట్టిగా ప్రస్తావించారు. PACS అధ్యక్షులు రైతుల సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలు చూపడం, రుణాలు, ఎరువులు, సీడ్స్ సరఫరా, పంటల మార్కెటింగ్, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడం, డిజిటల్ రికార్డింగ్, ఆధునిక సేవల వినియోగం ద్వారా వ్యవస్థను సమర్థవంతంగా మార్చడం, సిబ్బందికి నాయకత్వం, ప్రేరణ అందించడం వంటి భాధ్యతలు నెరవేర్చాలి. PACS వ్యవస్థ బలపడితే రైతు బలపడతాడు అని రైతు బలపడితే రాష్ట్రం బలపడుతుంది. అని అన్నారు

ఈరోజు శిక్షణ తరగతులు చివరి రోజు సందర్భంగా పిఎసిఎస్ అధ్యక్షులకు శిక్షణ ఇచ్చిన రమణారావు కోటేశ్వర రావు కి నెట్టెం రఘురాం సన్మానించారు. ఈ సందర్భంగా గుడివాడ బ్రాంచ్ రివ్యూ మీటింగ్ లో పాల్గొని డిపాజిట్లు పెంచడంపై దృష్టి సారించాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శామ్ మనోహర్ GM చంద్రశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *