విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నేపాల్‌లో చిక్కుకున్న 144 మంది తెలుగు ప్రజలు నేడు సురక్షితంగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి వారిని ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణ చర్య, కృషి వల్లే ఈ సహాయక చర్యలు వేగంగా జరిగాయని పల్లా అన్నారు. లోకేష్ ఎప్పుడూ ప్రజల కోసం ముందుండే నాయకుడు. ఎక్కడ తెలుగు ప్రజలు ఇబ్బంది పడ్డా, అది మన బాధ్యత అన్న భావనతో పని చేస్తారు. ఈరోజు 144 మంది సురక్షితంగా తిరిగి రావడం ఆయన కృషి ఫలితం అని అన్నారు. విమానాశ్రయానికి చేరుకున్న వారిలో విశాఖ పరిసర ప్రాంతాల వారికి కార్లు, క్యాబ్‌లు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకానికి ఈ సంఘటన మరో ఉదాహరణ” అని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News