Breaking News

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లు పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్: డా. జి. లక్ష్మీష, ఐఏఎస్., విజయవాడ ఐ.పీ.ఎస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్.ఎం, ఐ.ఏ.ఎస్., పోలీస్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఏసీపీ దుర్గారావు తదితరులు దుర్గగుడి ఈవో వి.కె. శీనానాయక్ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా ఏర్పాట్ల పురోగతిని సమీక్షించడానికి అధికారులు క్షేత్రస్థాయి పర్యటన ఈ రోజు ఉదయం నిర్వహించారు. ఈ పర్యటనలో ఆలయ ఇంజనీర్లు కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దసరా ప్లాన్ పరిశీలన, క్యూలైన్లకు అత్యవసర ద్వారాలు ఏర్పాటు పరిశీలన ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఏర్పాట్లు: క్యూలైన్లు , హోల్డింగ్ ఏరియాలు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త హోల్డింగ్ పాయింట్లు నిర్ణయించారు. ఇది భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి మరియు క్యూలైన్లలోకి క్రమంగా ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. క్యూలైన్ల పరిశీలన: భక్తుల రద్దీని నియంత్రించడానికి ఏర్పాటు చేయనున్న క్యూలైన్లను అధికారులు పరిశీలించారు. ఈ క్యూలైన్లు వినాయకుడి గుడి, సీతమ్మవారి పాదాలు, ఆర్‌ఈ చైనావాల్, టోల్‌గేట్, ఘాట్ రోడ్ మీదుగా అమ్మవారి ఆలయం వరకు విస్తరిస్తారు. గతంలో ఉన్న సమస్యలను అధిగమించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ట్రాఫిక్ నియంత్రణ: దసరా ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్కింగ్ స్థలాల గుర్తింపు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలపై పోలీస్ అధికారులు సమీక్షించారు.
భక్తులకు సౌకర్యాలు: క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, పాలు, అన్నప్రసాదం అందించే ఏర్పాట్లు చేయనున్నారు. మరుగుదొడ్లు, వైద్య సహాయ కేంద్రాలు, సమాచార కేంద్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
భద్రతా చర్యలు: దసరా ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గతేడాది అనుభవాల ఆధారంగా, భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ఘాట్‌లలో సీసీటీవీ కెమెరాల నిఘా పెంచనున్నారు.
ఆన్‌లైన్ సేవలు: ఆన్‌లైన్‌లో స్వచ్ఛంద సేవకులకు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
అధికారుల సూచనలు: అన్ని ప్రభుత్వ శాఖలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకొని పనిచేయాలి. పారిశుద్ధ్యం: ఆలయ పరిసరాలు, నది ఘాట్‌లు, క్యూలైన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. నాణ్యత: భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం నాణ్యతలో రాజీపడకూడదు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను విజయవంతం చేయడానికి, భక్తులకు మెరుగైన దర్శనం, సౌకర్యాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *