విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆచార్య రంగా నగర్ ప్రాంతం పర్యటించి జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమం లో పాల్గొని అక్కడున్న ప్రజలకు కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, భగత్ సింగ్ నగర్ రోడ్డు, జిఎస్ రాజు రోడ్డు, అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్, డాబాకోట్లు సెంటర్, మాకినేని బసవపునయ్య స్టేడియం ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 15 వేల రూపాయల వరకు ఆదా చేసే అవకాశం ఉందని, వ్యాపారులకు అమ్మకాలు పెరుగుదల ఉంటుందని, దేశవ్యాప్తంగా తక్కువ జీఎస్టీ రేట్లు వర్తిస్తాయని రోజువారి ఉపయోగించే చాలా వస్తువులపై జీఎస్టీ 0% లేదా ఐదు శాతం, ప్రధానంగా రెండు పన్నుల స్లాబ్లు మాత్రమే ఉన్నాయి అని తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె. షమ్మీ, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) ఇంచార్జ్ మరియు ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, సిడిఓ 3 ఉమామహేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News