విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లైన్స్ క్లబ్ ఆఫ్ చెన్నై ఆయుష్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇండియన్ ఓం కార్యాలయంలో లైన్స్ వరల్డ్ సర్వీస్ డే ప్రాజెక్ట్ లో భాగంగా లయన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి విచ్చేసిన వారికి మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ పంపిణీ చేయబడింది. దీని ద్వారా ఎవరి ఆరోగ్యాన్ని వాళ్లే మెరుగుపరుచుకునే లాగా ఇకముందు అనారోగ్యం బారిన పడకుండా ఈ సాధనం ఉపయోగపడుతుందని, మోడీ దీనిని వాడి ఫిట్నెస్ సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. చేతిలో ఉండే ప్రెషర్ పాయింట్స్ ని ఈ కర్ర ఒత్తిడి ఇవ్వటం ద్వారా ప్రాణశక్తి రిస్టోరేషన్ జరిగి, ఆరోగ్యవంతులవుతులు అవుతారు. యోగ శక్తి సాధన సమితి కార్యదర్శి కొండవీటి సుమతి, ఇండియన్ ఓం తెరపిస్టులు నాగమణి,విటల్, రియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. లైన్స్ క్లబ్ ఆఫ్ చెన్నై ఆయుష్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకున్నట్లు, సంస్థ సభ్యుడు లయన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.
Prajavartha Online Telugu News