Breaking News

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మిథాలీ రాజ్ స్టాండ్, రావి కల్పనా గేట్ ప్రారంభం

-ఆవిష్క‌రించిన ముఖ్యఅతిథి మంత్రి నారా లోకేష్
-హాజ‌రైన ఐసిసి చైర్మ‌న్ జ‌య్ షా, బిసిసిఐ ప్రెసిడెంట్ మిథున్ మన్‌హాస్, ఏసీఏ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా సతీష్ బాబు
-మిథాలి కి వెండి క్రికెట్ బంతిని బహుమతిగా అందించిన మంత్రి లోకేష్‌

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆదివారం మహిళల క్రికెట్‌లో అత్యున్నత విజయాలు సాధించిన మ‌హిళ క్రికెట‌ర్లు మిథాలీ రాజ్ రావి కల్పనలకు ఘనంగా గౌర‌వించింది.. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఎ గ్యాలరీ స్టాండ్ కు మిథాలీ రాజ్ పేరు, మూడో గేట్ కు రావి క‌ల్ప‌న పేరుతో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఆదివారం ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆవిష్క‌రించారు.. ఈ కార్య‌క్ర‌మానికి ICC చైర్మ‌న్ జయ్ షా, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, క్రికెట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ఈ వేడుకకు ఐసీసీ సి.ఈ.వో సంజోగ్ గుప్తా, క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బైర్డ్ , ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్‌బర్గ్ కూడా హాజరయ్యారు. బిసిసిఐ అధ్యక్షుడు మిథున్ మన్‌హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభ్‌తేజ్ భాటియా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ACA తరపున కార్యదర్శి సానా సతీష్ బాబు, ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి బి విజయ్ కుమార్ ల‌తో పాటు కౌన్సిలర్ దంతు గౌర్ విష్ణుతేజ్ హాజరయ్యారు.

భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ముందున్నారు. ఆమె మొత్తం 10,868 పరుగులు చేశారు. ఇందులో 7 శతకాలు, 85 అర్ధశతకాలు ఉన్నాయి.

1999లో అంతర్జాతీయ క్రికెట్‌కు అరంగేట్రం చేసిన మిథాలీ, భారత జట్టును రెండు వన్డే వరల్డ్ కప్ లో ఇండియా టీమ్ ను ఫైనల్స్‌కు తీసుకురావ‌టంలో కీల‌క పాత్ర పోషించింది. అంతేకాకుండా, 150కి పైగా వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ఏకైక భారత మహిళా క్రికెటర్ గా మిథాలీ రాజ్ రికార్డ్ క్రియేట్ చేశారు..23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆమె చూపిన నిబద్ధత, స్థిరత్వం, మరియు నాయకత్వం ఆమెను చారిత్రక వ్యక్తిగా నిలిపాయి.

మంత్రి నారా లోకేశ్ గారు మిథాలీకి ACA లోగోతో కూడిన లిమిటెడ్ ఎడిషన్ హ్యాండ్‌క్రాఫ్ట్ చేసిన వెండి క్రికెట్ బంతిని బహుమతిగా అందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి నారా లోకేశ్ గారు మాట్లాడుతూ: “మిథాలీ రాజ్ అనేది కేవలం పేరు కాదు – ఒక బ్రాండ్. ఆమె అద్భుతమైన క్రికెటర్ మాత్రమే కాదు, దేశంలోని లక్షలాది యువతులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ACA–VDCA స్టేడియంలో ఆమె పేరు మీద స్టాండ్ ఉండటం రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రం నుండి వందలాది మిథాలీలు రాలాలని, దేశానికి సేవ చేయాలంటూ ఆకాంక్షించారు.

ICC చైర్మన్ జయ్ షా మాట్లాడుతూ మిథాలీ రాజ్ ఇండియాలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ ను ప్ర‌భావితం చేసింది. ఎంతో మంది మ‌హిళ క్రికెట‌ర్ల‌కు స్పూర్తిగా, ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. ఈ స్టేడియంలో ఎ గ్యాల‌రీకి ఆమె పేరు పెట్ట‌డంతో స‌రైన గుర్తింపు ల‌భించింద‌ని పేర్కొన్నారు . ఈ ప్రోత్సాహంతో…మ‌హిళ‌లు క్రికెట్‌ను ఎంచుకుని రాబోయే తరం క్రికెటర్లుగా ఎదగాలని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

ACA అధ్యక్షుడు కేసినేని శివనాథ్ మాట్లాడుతూ వుమెన్స్ క్రికెట్ లో లెజెండ్ మిథాలీ రాజ్ ను గౌర‌వించ‌టం ఏసీఏ అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఆమె పేరు మీద స్టాండ్ ఏర్పాటు చేయడం ACAకి గర్వకారణంగా పేర్కొన్నారు.

అనంత‌రం మిథాలీ రాజ్ స్పందిస్తూ వైజాగ్ లో త‌న పేరు మీద స్టాండ్ ఏర్పాటు చేయడం త‌న‌కు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపు ఇచ్చినందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ACAకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నగరం నా ఎదుగుదలకి కేంద్ర బిందువుగా నిలిచింది. మహిళల క్రికెట్ ఎంత అభివృద్ధి చెందిందో చూసి ఎంతో ఆనందంగా ఉందన్నారు

రావి కల్పనా మాట్లాడుతూ ఇదంతా త‌న‌కి ఒక క‌ల‌లా అనిపిస్తుంద‌న్నారు. త‌న‌ కెప్టెన్ మిథాలీ దిదీతో కలిసి గౌరవం పొందుతాన‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌న్నారు. మంత్రి నారా లోకేష్, ఏసీఏ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రానికి చెందిన మ‌హిళా క్రికెట్ క్రీడాకారులు రాబోయే రోజుల్లో దేశానికి పేరు తెస్తారన్న నమ్మకం ఉందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *