వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా వరల్డ్ కప్ మ్యాచుల్లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ లో మిధాలీ రాజ్ పేరు, రావి కల్పన పేరుతో ఏర్పాటు చేసిన గ్యాలరీ, గేట్ లను ఆవిష్కరించేందుకు విచ్చేసిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం స్టేడియంలో చేపట్టిన అభివృద్ది పనులు గురించి మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఎంపీ కేశినేని శివనాథ్ , సెక్రటరీ సానా సతీష్ బాబు వివరించారు. . అనంతరం స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ మ్యాచ్ ను వీక్షించారు. ఈ కార్యక్రమంలో దండమూడి శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, సంయుక్త కార్యదర్శి బి విజయ్ కుమార్ , కౌన్సిలర్ దంతు గౌర్ విష్ణుతేజ్, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి. చాముండేశ్వర నాథ్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News