Breaking News

‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి

-జిల్లాకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ టీం
-రాష్ట్రంలోని 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం
-శ్రీకాకుళం జిల్లాకు కెవిఎన్ చక్రధర్ బాబు ఐఏఎస్
-ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త :
‘మొంథా’ తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. రేపు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.భారీ వర్షాలు నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు 45 -55 కి.మీ గరిష్టముగా 65 కి .మీ వేగముతో వీచే అవకాశముంది .ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది.భారీ వర్షాలు నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు 60-70 కి .మీ గరిష్టముగా 80 కి .మీ క్రమముగా 90-100 కి .మీ గరిష్టముగా 110 కి .మీ వేగముతో వీచే అవకాశముంది.ఈ తుపాను జిల్లాపై అక్టోబర్ 28 మరియు 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన జిల్లాలోని ఆయా శాఖల ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తుఫాను ప్రభావిత పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈనెల 29 (బుధవారం) వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని, సముద్రంలోపల ఉన్నవారు వెంటనే తీరానికి చేరుకోవాలని,వరి పంట కోత దశలో ఉన్నట్లయితే, ఈ నాలుగు రోజులు కోతలు కోయరాదని, ఇప్పటికే వరి కోతలు జరిగి పొలాల్లో ఉన్న చేనును కల్లాలకు చేర్చడం లేదా వాటిని సంరక్షించే చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా, ప్రతీ మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, కలెక్టరేట్‌లో 08942-240557 నంబరుతో కంట్రోల్ రూమ్ సిద్ధంగా ఉందని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *