Breaking News

మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును, ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాము

-రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త :
చాట్రాయి మండలం నరసింహారావు పాలెం గ్రామంలో రైతు సేవాకేంద్ర భవనం ప్రాంగణంలో శనివారం చాట్రాయి మండలంలోని ముప్పు భారిన పడిన 161 మంది మత్స్యకార కుటుంబాలకు 50 కేజీలు బియ్యం, పంచదార 1కేజీ, వంటనూనె 1 లీటరు, ఉల్లిపాయలు 1 కేజీ, కందిపప్పు 1కేజీ, బంగాళ దుంపలు 1 కేజీ చొప్పున ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ “మొంథా తుపాన్”వల్ల ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ నారా లోకేష్ నిరంతరం సమీక్షలు నిర్వహించి అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. దీని దృష్ట్యా జిల్లాయంత్రాంగం ముందస్తు సన్నద్ధత ద్వారా సమర్థవంతంగా సమన్వయం తో పనిచేయడంవల్ల జిల్లాలో ఎక్కడ ప్రాణం నష్టం జరగలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులు యోగక్షేమాలు తెలుసుకొని, పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారన్నారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు భోజనం వసతి, తదితర సౌకర్యాలు అన్ని కల్పించామన్నారు. వారు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు 25 కేజీలు బియ్యం, 5 రకాలు నిత్యవసర వస్తువులు, మూడు వేలు రూపాయలు నగదును అందించామన్నారు. జిల్లాలో వరి, ఉద్యానవన పంటలు, ఆస్తి నష్టాలు తదితర వాటిపై జిల్లా, మండల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ వేగవంతంగా చేస్తున్నారని తెలిపారు. పూర్తయినాక పంట నష్టాలు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని, రైతులు మనోభావాలు అనుగుణంగా జరిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి తహశీల్దారు జి.భద్రునాయక్, యంపిడివో బి.ఏ. సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, మత్స్యకారులు కుటుంబాలు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *