Breaking News

జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్ధార్ వల్లభాయ్ పటేల్

-ప్రజలంతా జాతీయ ఐక్యతా భావంతో మెలగాలి
-31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు
-కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, మై భారత్ ఏలూరు జిల్లా సంచాలకలు భారత్, యువజన అధికారి సుంకర రాము

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ధార్ @ 150 లో భాగంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రచార యాత్ర డిజిటల్ దశను ప్రారంభించటం గర్వంగా ఉందని కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, భారత్, జిల్లా యువజన అధికారి సుంకర రాము తెలిపారు.

నగరంలోని స్థానిక మై భారత్ ఆఫిస్ పోలువారి స్ట్రెట్ లక్ష్మి వరపు పేట ఏలూరు, నందు సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం జిల్లాలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మై భారత్ భారత్, జిల్లా యువజన అధికారి సుంకర రాము మాట్లాడుతూ భారత చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు అతి పెద్ద ప్రచారయాత్ర నిర్వహించడం జరగుతుందన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా అక్టోబర్ నెలలో దేశవ్వాప్తంగా అన్నిరాష్ట్రాలు, జిల్లాలలో సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏలూరు జిల్లా లో త్వరలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా (భారత ఉక్కు మనిషి) గా భారతీయ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఆయన చేసిన త్యాగాలను మరువలేమన్నారు.

ZP CEO హరి మాట్లాడుతూ భారత్ లో భాగంగా స్థానిక సంస్కృతి, వైవిధ్యాలను ప్రతిబింబించే విధంగా పట్టణాలు, గ్రామాలలో ఈ నెల 31 నుండి నవంబర్ 25 వరకు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా యోగా, ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, మత్తు రహిత భారత ప్రతిజ్ఞలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రచారయాత్రలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శన నిర్వహిస్తామని, స్వచ్ఛత డ్రైవ్ లు, మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ , ఎన్ఎస్ఎస్ యువత చురుకుగా పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో బిజెపి డిస్టిక్ జనరల్ సెక్రెటరీ నాగ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *