Breaking News

ఇండియాస్ స్కేల్ అడ్వాంటేజ్ బిల్డింగ్ గ్లోబల్ చాంపియన్స్ పై జరిగిన కార్యక్రమం…

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ విస్తృత స్థాయి బలం.. ప్రపంచ స్థాయి సంస్థలను నిర్మించడం.. అనే అంశం పై ఐటీ ఈ అండ్ సీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువత ఆలోచనా విధానంలో యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు, వైట్ కాలర్ జాబుల మీద దృష్టి నిలిపేవారన్నారు. ప్రస్తుత రాష్ట్ర యువత ఆలోచన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఐటి ప్రభావంతో యువత ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్నాయన్నారు. ఏపీ లో మౌలిక వసతుల కల్పన, కొత్త కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో దేశంలోనే రాష్ట్రం ముండదుగులో ఉందన్నారు. దీనికి సంబంధించి క్రొత్త స్టార్ట్ పాలఎసీలను తీసుకురావడం వల్ల కంపెనీల స్థాపనకు ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలో కంపెనీలను స్థాపించే వారికి, స్థాపించడానికి ముందు వస్తున్న వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు, రాష్ట్రంలో కంపెనీలు వస్తువులను తయారు చేసి, సర్టిఫికేషన్ కొరకు కంపెనీలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమైన ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ను తయారు చేసే విధానంతో ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో డేటా అందుబాటులో ఉందని, దానిని ఆధారంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం, వాటికి కావలసిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. దీనికి ఉదాహరణే కరోనా సమయంలో ఎక్కువ మందికి టీకాలు అందించడం జరిగిందన్నారు. సర్వీస్ సెక్టార్ లో కూడా రాష్ట్రంలో ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రాష్ట్రంలో తయారయ్యే వస్తువులు, సేవలకు మంచి మార్కెట్ ఉంటుందన్నారు.

సిఐఐ ఏపీ శాఖ ప్రెసిడెంట్ జీ. మురళీ కృష్ణ ఈ చర్చా కార్యక్రమానికి మోడరేటర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందు చూపుతో కంపెనీల స్థాపనకు అనేక అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సాహకాలు కూడా అందిస్తుందన్నారు. వాటిని ఉపయోగించుకుని కంపెనీలు స్థాపనకు ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. కంపెనీలు వస్తువుల తయారీ, సర్టిఫికేషన్ లో కూడా పారదర్శక విధానంతో రాష్ట్రం ఉందన్నారు.

కార్యక్రమంలో ప్రొఫెసర్. సత్య చక్రవర్తి పరిశ్రమల స్థాపనలో ప్లానింగ్, అంతర్జాతీయంగా మన వస్తువుల ఎగుమతులపై ముందు చూపుతో ముందుకెళ్లాలన్నారు.

తుషార్ సింగ్వీ మాట్లాడుతూ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సర్విస్ రిలేటెడ్ బిజినెస్ అంశాల పై మాట్లాడారు. రోహిత్ సర్కార్ మాట్లాడుతూ ఐవోటీ, సెన్సార్ల పై మాట్లాడారు. ఆలూరి శ్రీనివాసరావు క్వాంటమ్ కంప్యూటింగ్ ఆవశ్యకత పై మాట్లాడారు.

డాక్టర్ వెంకట రమణ, అవేర్ సీఈఓ ఎలెక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, తయారీలో ఉన్న ఇబ్బందులను అవి ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *