-స్టేడియంలో మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, వర్లకుమార్ రాజా
వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్ ను ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు , పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా లతో కలిసి ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ తిలకించారు. మ్యాచ్ నిర్వహణ కోసం ఏసీఏ చేసిన భద్రతా ఏర్పాట్లు, ప్రేక్షకుల కోసం కల్పించిన వసతుల పై మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేశారు. వీరంతా కలిసి భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.
Prajavartha Online Telugu News