అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో మంగళవారం అధికారులు, సిబ్బంది సమక్షంలో ఏపీ సిఆర్డిఏ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. APCRDA డిసెంబర్ 10 2014న ఏర్పడగా..ఈ ఏడాదితో సంస్థ ప్రయాణం పదకొండేళ్లకు చేరుకుంది. ఈ సందర్భంగా APCRDA ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ ఐ.ఏ.ఎస్., ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, సామాజిక సంక్షేమ విభాగ గ్రూప్ డైరెక్టర్ వెలుగోటి రాములు, HR విభాగ డైరెక్టర్ బి.మల్లిఖార్జున రెడ్డి, కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే(LA) ఎస్. రవీంద్ర ప్రసాద్, APCRDAలోని పలు విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన APCRDA కార్యకలాపాలలో భాగస్వామ్యం వహిస్తున్న ఉద్యోగులకు అడిషనల్ కమిషనర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలసి అడిషనల్ కమిషనర్ గారు కేక్ కటింగ్ నిర్వహించారు. ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ..CRDA పదకొండేళ్ల ప్రయాణంలో అనేక ఘనతలు సాధించిందని, ఈ ప్రయాణంలో అనేకమంది ఉద్యోగులు కీలక బాధ్యతలు నిర్వర్తించారన్నారు. CRDA ఉద్యోగులంతా ఒక కుటుంబం మాదిరిగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఉద్యోగులు, అధికారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News