మహిళలు ఆర్ధిక పరిపుష్టిని పెంపొందించాలనే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం…

-కరోనా కష్ట కాలంలో కూడా ఆగని సంక్షేమ పథకములు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని భవానిపురం లారీ స్టాండ్ నందు 40, 43, 45 డివిజన్లకు సంబందించి ఏర్పాటు చేసిన 2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాల కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్లతో కలసి పాల్గొన్నారు. ఈ వేడుకలలో మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వయం సహయక సంఘాలలోని మహిళలకు బుణ మాఫీ చేస్తానని వై.ఎస్. జగన్ తన పాద యాత్రలో ఇచ్చిన హామీలను వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ద్వారా జగనన్న ప్రభుత్వం 4 విడతలుగా బ్యాంక్ ల వారికీ జమ చేయుట జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమాన్నికి పెద్ద పీట వేసి, మహిళలకు ఇచ్చిన హామీని నేరవేర్చుటలో ఈ ప్రభుత్వం రెండోవ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలు నిర్వహించుట ఏంతో సంతోషకరమని, ఈ సంబరాలు మనకు ముందే దసరా పండుగ తీసుకువచ్చన ముఖ్యమంత్రి గారికి మహిళలు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, పెన్షన్ భరోసా, వై.ఎస్.ఆర్ ఆసరా వంటి అనేక సంక్షేమ పథకములు నిరాటంకంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని అన్నారు. 297 గ్రూపులకు 1 కోటి 29 లక్షల రూపాయల చెక్కును మేయర్ కార్పోరేటర్లతో కలసి గ్రూప్ సభ్యులకు అందజేసారు.
సెంట్రల్ నియోజక వర్గం లోని 27, 28 మరియు 29 డివిజన్ లకు సంబందించి దుర్గాపురంలోని STVR పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, ఎమ్మెల్సీ కరీమున్సీసా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మహిళలకు సుస్థిర ఆదాయ కల్పనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలకు కల్పించడంతోపాటు సాంకేతిక, బ్యాంకింగ్ రంగాలలో శిక్షణనిచ్చి జీవనోపాధిని కల్పించడం జరుగుతోందన్నారు. వైఎస్సార్ ఆసరా తొలి విడత ద్వారా సెంట్రల్ లో 3,251 గ్రూపులకు 28 కోట్ల 38 లక్షల 58వేల 530 రూపాయలు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అందించినట్లు వివరించారు. రెండోవిడతలో 3,405 గ్రూపులకు 29 కోట్ల 45 లక్షల 25 వేల 458 లబ్ధి చేకూర్చామన్నారు. 27 వ డివిజన్ లో రెండో విడతకు సంబంధించి 96 గ్రూపులకుగాను రూ. 83 లక్షల 89 వేల 170 రూపాయలు, 28 వ డివిజన్ లో 75 గ్రూపులకు సంబంధించి రూ. 70 లక్షల 47 వేల 95 రూపాయలు, 29వ డివిజన్ కు సంబంధించి 139 గ్రూపులకు గానూ రూ. కోటి 7 లక్షల 22 వేల 583 రూపాయలను నేరుగా డ్వాక్రా మహిళల ఖాతాలలో జమ చేశామన్నారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2 మరియు 6వ డివిజన్లకు సంబందించి చైతన్య స్కూల్ గ్రౌండ్స్ నందు జరిగిన వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వై.ఎస్.ఆర్.సి.పి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్లతో కలసి 223 గ్రూపులకు రూ. 2,23,26,959/-రూపాయలు చెక్కును అందించుట జరిగింది.
కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, యు.సి.డి సిబ్బంది, వైఎస్సార్ సీపీ శ్రేణులు, పొదుపు సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *