Breaking News

న్యాయవాదులు కొవ్వొత్తుల ప్రదర్శన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
04-02-2026 లో చేవెళ్ల బార్ అసోసియేషన్ న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ సోమవారం బెజవాడ బార్ అసోసియేషన్ లో న్యాయవాదులు కొవ్వొత్తుల ప్రదర్శనతో ఘన నివాళులు అర్పించారు. ముందుగా గాంధీ కి పూలమాలను వేసి స్వప్న చిత్రపటం నకు బెజవాడ బార్ అధ్యక్షులు అయిన ఎ కె బాష మరియు జనరల్ సెక్రెటరీ కేవీ రంగారావు సీనియర్ న్యాయవాది చేకూరి శ్రీపతి కలసి స్వప్న చిత్రపటానికి పూలమాలను వేసి ఆమె ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమెకి సంఘీభావం తెలిపి కొవ్వొత్తులతో చేవెళ్ల న్యాయవాది స్వప్న కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎ కె బాష మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో రాజ్యాంగాన్ని చదివి చట్టాన్ని కాపాడతామని చెప్పి ప్రతిజ్ఞ చేసి న్యాయవాద వృత్తిలోకి వచ్చిన న్యాయవాదులపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఖండించాలని అదేవిధంగా తోటి సోదరి అయిన స్వప్న తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి గతంలో మూడుసార్లు పోలీసు వారికి రిపోర్టు ఇచ్చినను తగువిధంగా స్పందించకుండా అశ్రద్ధ చేసి చివరికి దుండగుల చేతిలో అకాల మృతి చెందిన స్వప్న భౌతికకాయాన్ని పోస్ట్ మాత్రం చేయడం కోసం వచ్చిన పోలీసు వారిపై తగు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఆమె స్త్రీ మూర్తి అయ్యుండి కూడా దుండగులు కిరాతకంగా చంపినందుకు ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండించి తక్షణమే న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని అశ్రద్ధ చూపిన పోలీసు వారిపై తగు చర్యలు తీసుకోవాలని బెజవాడ బార్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన విదేశీయ న్యాయవాది అయిన అటార్నరీ డాక్టర్ శ్రీనివాసరావు కావేటి ప్రసంగిస్తూ మహిళా న్యాయవాదిని అమానుషంగా హత్య చేసిన ముద్దాయిలను వెంటనే శిక్షించాలని ఈ విషయం తెలుసుకొని నేను, బెజవాడ బార్ అసోసియేషన్ ని సంప్రదించి చట్టాన్ని రక్షించవలసిన పోలీసు వారు తమ వృత్తిలో అశ్రద్ధ చేస్తే అది కూడా చట్టపరిధిలో నేరమేనని బెజవాడ బార్ అసోసియేషన్ వారు తనకు అవకాశం ఇస్తే ఆ పోలీసు వారికి వారి బాధ్యతను గుర్తు చేస్తానని న్యాయవాద మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ కె.వి.రంగారావు స్వప్న అకాల మృతికి సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శనలో న్యాయవాదులు అందరితో కలిసి సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమానికి వైస్ ప్రెసిడెంట్ పిల్లా శ్రీనివాసరావు, ట్రెజరర్ ముద్దాడ సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు సోమకృష్ణమూర్తి, చలసాని అజయ్ కుమార్, చోడిశెట్టి మన్మధరావు మరియు సీనియర్ న్యాయవాదులు రాంప్రసాద్ గంగాభవాని, పిచ్చుక శ్రీనివాసరావు ఇంకా ఇతర సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొని స్వప్నకి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *