Breaking News

విజయవాడలో ఫిబ్రవరి 28 న పెద్ద ఎత్తున బీసీ లతో ధర్నా

– వి.జి.ఆర్ నారగొని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 28న బీసీలందరూ కలిసి భారీ ఎత్తున మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నారగోని ప్రకటించారు సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయిలో బిసి కులగణన చేపడతామని చెప్పిన మోడీ గారు మాట తప్పి బీసీలను మోసం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం గా ఉన్నది. బీసీ కులగణన ఇప్పుడు జరగకపోతే పది సంవత్సరాల వరకు జరగడానికి అవకాశం లేదు. కోర్టు ల్లో బిసి జనాభా లెక్కలు అడిగినప్పుడు ప్రభుత్వాల వద్ద సరైన సమాధానం లేదు.
మార్చి మొదటి వారంలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించినాము. విజయవాడ నగరంలో జరిగే ధర్నాకు సిపిఐ, సిపిఎం అన్ని ప్రజా సంఘాలను ఇతర బీసీ సంఘాల నాయకులను మద్దతుతో నిర్వహించడం జరుగుతుంది.
కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నామినేటెడ్ పదవులను బీసీలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లు లేరు,ఆఫీసులు లేవు, నిధులు లేవు. అభివృద్ధి శూన్యం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో టిడిపి మీద టిడిపి నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరిగినాయి.
కూటమి ప్రభుత్వంలో కూడా వైసిపి నాయకుల మీద, ఇళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యక్తిగతమైన దాడులు జరుగుతున్నాయి.
ఏదైనా సమస్య వస్తే మీడియా ద్వారా సిద్ధాంత పరంగా విమర్శలు చేసుకోవచ్చు.
హుందాగా వ్యవహరించాలి దిగజారుడు రాజకీయాలు చేయకూడదు.
దాడులు చేయడమే కాకుండా వారిపై కేసులు కూడా పెడుతున్నారు ఇది దారుణమైన చర్య.
గతంలో రాయలసీమలో ఫ్యాక్షసి ఉండేది. ఏపీలో కొత్త సంస్కృతిని సృష్టిస్తున్నారు.
జగన్ మెప్పుకోసం చంద్రబాబును తిడితే నాకు పదవి వస్తుందని వైసిపి నాయకులు తిట్టినారు.
చంద్రబాబు మెప్పుకోసం టిడిపి వారు దాడి చేస్తున్నారు. దీన్ని ఆపాలని ఈ సందర్భంగా కోరుతున్నాము.
ఈ సమాజంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఈ రెండు కుటుంబాలేనా ప్రశ్నించారు.
వి.అయ్యన్న బాబు మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పులు రాబోతున్నాయి అనేదానికి బీసీ మహాధర్నా నిదర్శనం.
రిజర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం .
సుప్రీంకోర్టు కొన్నిసార్లు వ్యతిరేకంగా కొన్నిసార్లు అనుకూలంగా రిజర్వేషన్లు పై తీర్పు చెప్పినాయి. రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లకుండా పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది.
ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాలు నడిచింది. సుప్రీం కోర్ట్ అనుకూల వ్యతిరేక తీర్పుతి ఇచ్చింది.
సుప్రీం కోర్ట్ బీసీలకు 27% మించి రిజర్వేషన్ లేదని చెప్పినాయి. ఈరోజు రిజర్వేషన్లు అమలు జరిగే పరిస్థితి లేదు.
కేంద్రం లో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా 90% ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లినాయి. అందువలన ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయి ప్రైవేటు ఉద్యోగాలు పెరిగిపోయినాయి.
ప్రభుత్వ రంగంలో ఉన్న రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తున్నారు అదేవిధంగా ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతున్నాము.
ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాత ఎస్సీల మధ్య పెద్ద అగాధం ఏర్పడింది.
బీసీ రిజర్వేషన్ లు జనాభా ప్రాతిపదికన కచ్చితంగా 44% అమలు చేయాలి 28వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు మహా ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం పోట్లూరి శ్రీదేవి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు,పూర్ణచంద్రరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ,జై బాబు, రేఖ, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *