Breaking News

కైకలూరు నియోజకవర్గంలో గత రెండు విడతులుగా ఒక్క కైకలూరు నియోజకవర్గంలోనే వై.ఎస్.ఆర్ ఆసరా క్రింద 188 కోట్లు రుణమాఫీ అయ్యింది. ఇది ఒక చరిత్ర…

-శాసనసభ్యులు దూలేం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నీతి నిజాయితీ నిబద్ధత తో మీకోసం పనిచేస్తున్న వారిని ఆదరించి దీవించాలని, మీ అన్నగా,తమ్మునిగా మీ అప్పులు తీర్చి మీకు ఆసరా గా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్.జగనన్నను మీరు ఎల్లప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకుని, మీ ఆశీస్సులు అందజేయాలని శాసనసభ్యులు దూలేం నాగేశ్వరరావు స్వశక్తి సంఘ మహిళలను ఉద్దేశించి అన్నారు.
వైఎస్సార్ ఆసరా 2 వ విడత రుణ మాఫీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కైకలూరు మండలంలోని పెంచికలమర్రు గ్రామ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రజాసంకల్పపాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో అక్కచెల్లమ్మలు పడుతున్న కష్టాలను నేరుగా చూసి, విని, మనం అధికారంలోకి రాగానే నవరత్నాల పధకాలను అమలు చేస్తూ, చెప్పిన తేదికి ఇచ్చిన మాటకు, నేరుగా అక్కచెల్లమ్మల బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ప్రతి సంక్షేమ పధకాన్ని వాలంటరీలు, సచివాలయం ఉద్యోగుల ద్వారా, అర్హులు అయిన ప్రతి ఒక్కరికి పేరు నమోదు చేసుకొని వారి వారి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారన్నారు. మీకు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలకు ఎవరైతే పరిపాలన అందిస్తారో వారికీ మీరు అండగా ఉండాలని, కులాల ముసుగులో వచ్చే వారిని నమ్మవద్దన్నారు. మీ యొక్క కొల్లేరు ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామని, గత పాలకులు మాదిరిగా నాకు ఓట్లు వేయలేదని, నాకు ఓట్లు వేసిన వారికీ మాత్రమే సంక్షేమ పధకాలు అందించకుండా నియోజకవర్గంలో నాకు ఓటు వేసినా, వేయకపోయినా అర్హులు అయిన ప్రతి ఒక్కరికి పరిపాలన అందిస్తున్నామన్నారు. కొల్లేరు ప్రాంతాభివృద్ది నాసహకారం ఉంటుందన్నారు. ఈ రోజు వైఎస్సారా ఆసరా రెండవ విడత 46,79,86,526 కోట్ల రూపాయలు కేవలం ఒక్క కైకలూరు నియోజకవర్గం అక్కచెల్లమ్మలకు వచ్చిందని, నియోజకవర్గంలో 5188 స్వయం సంఘాలకు 53010 మంది అక్కచెల్లమ్మలకు నేరుగా డబ్బులు వారి వారి ఖాతాలకు జమ చేశారన్నారు. గత సంవత్సరం పావలా వంతు ఈ సంవత్సరం పావలా వంతు మొత్తం సగం రుణమాఫీ ఇప్పటికి పూర్తి అయ్యిందన్నారు.ఈ లెక్క ప్రకారం ఒక్క కైకలూరు నియోజకవర్గంలోనే వై.ఎస్.ఆర్ ఆసరా క్రింద 188 కోట్ల రూపాయలు రుణమాఫీ అయ్యిందని, ఇది ఒక చరిత్ర అన్నారు. ఇది కనీవినీ ఎరుగని సహాయం అన్నారు.
గత పాలకులు మాదిరిగా మాట ఇచ్చి అక్కచెల్లమ్మలను మోసం చేసే పరిస్థితి లేదు అని, ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ప్రతి సంక్షేమ పధకం అమలు చేస్తున్నామన్నారు, అక్కచెల్లమ్మలు అందరు జగనన్నకు అండగా ఉండాలని, మీ అందరి ఆశీస్సులు జగనన్నకు ఇవ్వాలని కోరారు, అనంతరం ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తొలుత గ్రామ సర్పంచ్ జయమంగళ కాసులు ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. సర్పంచ్ కాసులు, గ్రామ పెద్దలు శాసనసభ్యులు డిఎన్ఆర్ కు గజమాల వేసి సన్మానించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ అడవి కృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరక్టర్ గంటా సంధ్య, .రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి, జడ్పీటీసీ కురెళ్ల బేబీ, ఎంపీటీసీ బంటుమిల్లి సాదు కొండయ్య, కొట్టాడ ఎంపీటీసీ సిద్దబత్తిన సువర్ణమ్మ, పెంచికలమర్రు సర్పంచ్ జయమంగళ కాసులు ప్రసంగించారు.
కార్యక్రమంలో సెక్రెటరీ తోట శ్రీనివాసరావు ,ఏసీ శోభనబాబు, ఏఎంపీలు ఎడ్వర్డ్, సత్యనారాయణ, ఎంపీటీసీలు సిద్దబత్తిన సువర్ణమ్మ, మూడెడ్ల శశికళ,, పట్టపు బాలమ్మ, బంటుమిల్లి సాధు కొండయ్య, మండల కో ఆప్షన్ సభ్యులుసోమల శ్యామ్ సుందర్, సర్పంచ్ లు సైదు వెంకటేశ్వరరావు,డీయం నవరత్నకుమారి, ఘంటసాల భాగ్యలక్ష్మి, కైకలూరు పీఏసీఎస్ అధ్యక్షులు పంజా రామారావు, వేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ భాస్కర వెంకటేశ్వరరావు, పందిరిపల్లిగూడెం పీఏసీఎస్ అధ్యక్షురాలు ఘంటసాల వెంకటేశ్వరమ్మ, నాయకులు,నిమ్మల సాయిబాబు, పడమట శేషవతారం, సలాది వెంకన్న, పెనుమల అంబేద్కర్, కొల్లాటి శ్రీను, శాఖమూరి రాజా,బలే సముద్రుడు, బలే నాగరాజు,గంటా కోటేశ్వరరావు,,ఘంటసాల జగన్నాధం,ఘంటసాల రామారావు,గ్రామ పెద్దలు, జయమంగళ జమిరాజు, ఘంటసాల తాతరాజు, జయమంగళ గోపి, ఘంటసాల నీలాద్రి, మోరు శ్రీను, బలే ఆనందరావు,డ్వాక్రా సీసీలు, వియంబీకేలు, డ్వాక్రా అక్కచెల్లమ్మలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *