మహిళా అభ్యుదయ సమాజ నిర్మాణమే లక్ష్యం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ లో పండుగలా ఆసరా సంబరాలు
-చంద్రబాబు డ్రామాలన్నీ ఏపీ ప్రజలకు తెలుసు
-ఏడో రోజు ’వైఎస్సార్ ఆసరా’ సంబరాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్‌ ఆసరా రెండవ విడత నగదు డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో విజయవంతంగా జమ అవుతుండటాన్ని పురస్కరించుకుని అక్కచెల్లెమ్మలు ఊరూరా పండగ వాతావరణంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఎల్.బి.ఎస్ నగర్లోని కమ్యూనిటీహాల్ నందు 61 మరియు 62 డివిజన్లకు సంబంధించి జరిగిన వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ రెడ్డి, ఆయా డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి  శాసనసభ్యులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చిత్రపటానికి పూల‌మాల వేసి ఘన నివాళులు అర్పించారు. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ.. మహిళా సాధికారత, అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా నిధులను పెట్టుబడిగా చేసుకుని.. ఆర్థిక అభివృద్ధి సాధించాలని అక్కచెల్లెమ్మలకు పిలుపునిచ్చారు. మహిళలపై ఉన్న ప్రత్యేక శ్రద్ధతో సున్నా వడ్డీకే సీఎం జగన్మోహన్ రెడ్డి రుణాలు మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. సరికొత్త మహిళా అభ్యుదయ సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న జగనన్న ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

మహిళలు ఎవరి మీద ఆధారపడకూడదన్నదే జగనన్న లక్ష్యం
గత ప్రభుత్వంలో తమ సుధీర్ఘ ఉపన్యాసాలు వినిపించేందుకు పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు గంటల తరబడి మండుటెండలో కూర్చోబెట్టే వారని మల్లాది విష్ణు గుర్తుచేశారు. కానీ ప్రతి మహిళను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది లక్షాధికారులను చేయాలన్న రాజన్న కలను సీఎం జగన్మోహన్ రెడ్డి  సాకారం చేస్తున్నారన్నారు. మహిళలు ఎవరి మీద ఆధారపడకూడదన్న ఉద్దేశంతో.. వారి ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆసరా తొలి విడత ద్వారా సెంట్రల్ లో 3,251 గ్రూపులకు 28 కోట్ల 38 లక్షల 58 వేల 530 రూపాయలు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అందించినట్లు మల్లాది విష్ణు గారు తెలిపారు. రెండోవిడతలో 3,405 గ్రూపులకు 29 కోట్ల 45 లక్షల 25 వేల 458 లబ్ధి చేకూర్చామన్నారు. రెండు విడతల్లో కలిపి మొత్తం రూ. 57 కోట్ల 83 లక్షల 83 వేల 958 రూపాయలు మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు అందించడం జరిగిందన్నారు.

61వ డివిజన్ లో 117 గ్రూపులకు గాను రూ. కోటి 6లక్షల 37 వేల 846 రూపాయలు., 62 వ డివిజన్ లో 302 గ్రూపులకు సంబంధించి రూ. 2 కోట్ల 75 లక్షల 72 వేల 84 రూపాయలు రెండో విడత ఆసరా ద్వారా పొదుపు సంఘాల గ్రూపులలో జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 61 వ డివిజన్ లో చందన పొదుపు సంఘానికి సంబంధించి అత్యధికంగా రూ. 8 లక్షలు., చంద్రకళ పొదుపు సంఘానికి రూ. 7 లక్షల 17 వేలు రెండో విడతలో ఆయా గ్రూపులకు లబ్ధి చేకూరిందన్నారు. 62వ డివిజన్ లో వికాస డ్వాక్రా గ్రూపునకు రూ. 7 లక్షల 51 వేలు., ప్రియాంక గ్రూపునకు రూ. 7 లక్షల 23 వేలు అత్యధికంగా రెండో విడతలో జమ అయిందన్నారు. వీటిని సద్వినియోగం చుసకుని మహిళలు సుస్థిర అభివృద్ధి సాధించాలన్నారు.

చదువే పిల్లలకిచ్చే అతిపెద్ద ఆస్తి
పేదరికం చదువుకు అడ్డుకాకూడదని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని.. మహానేత స్ఫూర్తితో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రూ.2 వేల కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం కాలేజీలకు పెట్టిన బకాయిలు చెల్లించడంతో పాటు.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తోందన్నారు. విద్యా దీవెన నగదు విద్యార్థుల తల్లుల బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేయడం ద్వారా జవాబుదారీతనం ఉంటుందని తెలియజేశారు.

చంద్రబాబు కన్నా సీఎం జగనే ఎక్కువ రోడ్లు వేయించారు
గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు వేసిన రోడ్ల కంటే.. వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి  రెండున్నర ఏళ్లలో అధిక రోడ్లు వేయించారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రోడ్ల నిర్వహణపై ప్రతిపక్ష నేతల ఆరోపణలను ఆయన ఖండించారు. గత చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల నిర్వహణను కనీసం పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి  రోడ్ల కోసం రూ.6 వేల కోట్ల విలువైన టెండర్లు పిలవడం జరిగిందన్నారు.

గత చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడంతో ఆ భారాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సి వస్తోందని మల్లాది విష్ణు అన్నారు. జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం అప్పు చేసిన ప్రతి పైసాకి లెక్క ఉందన్నారు. వెచ్చించిన ప్రతి రూపాయికి ఆధార్‌ నంబర్లతో సహా లబ్ధిదారుల లెక్క చెప్పగలమన్నారు. ఇలా తెలుగుదేశం చేసిన రూ. 2.40 లక్షల కోట్ల అప్పులకు లబ్ధిదారులెవరో పారదర్శకంగా సమాధానం చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. చివరకు పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా రూ. 60 వేల కోట్లు బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్లిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.

విద్యుత్ వ్యవస్థను భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుదే
గడిచిన ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ రంగాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుదేనని మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ హయాంలో 2019 నాటికి విద్యుత్ రంగంలో అప్పులు రూ.32,000 కోట్లకు చేరాయన్నారు. విద్యుత్ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసిన చంద్రబాబు.. నేడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో బషీర్ బాగ్ కాల్పులు జరిగి 21 ఏళ్ళు గడిచినా.. ఆ దారుణ మారణకాండ నేటికి కళ్ల ముందే మెదులుతోందన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించమన్న వారిపై చంద్రబాబు దుర్మార్గంగా కాల్పులు జరపగా.. ఈ కాల్పుల్లో ముగ్గురు అమరులయ్యారని, మరెందరో క్షతగాత్రులు అయ్యారన్నారు. ఆరోజు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  పోరాటం చేస్తుంటే వారిపై కూడా పోలీసులతో దాడి చేయించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం కుదేలవడానికి పూర్తి బాధ్యత ముమ్మాటికి చంద్రబాబుదేనని మల్లాది విష్ణు  అన్నారు. విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల పాపం కూడా గత ప్రభుత్వానిదేనని వివరించారు. ట్రూ–అప్‌ సర్దుబాటు కోసం 2014 నుండి 2019 మధ్య ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ పంపిణీ సంస్థలకి నాటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదని గుర్తు చేశారు. మరోవైపు బొగ్గు కొరత దేశవ్యాప్తంగా ఉందని.. దానిని అధిగమించే దిశగా కృషిచేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడం సబబు కాదన్నారు.

ఈర్ష్య, కడుపు మంటతోనే దుష్ప్రచారాలు
రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంటే స్వాగతించవలసిందిపోయి.. సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంపై ఈర్ష్య, ద్వేషాలతో ప్రతిపక్షాలు రగిలిపోతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. ఆయనను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక.. సంక్షేమ పథకాలను కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. మాట తప్పని మడమ తిప్పని నైజంతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉమ్మడి రమాదేవి, అలంపూర్ విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, షాహినా సుల్తానా, ఇసరపు దేవి, జానా రెడ్డి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, అధికారులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *