పార్టీలకతీతంగా అర్హులైన నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోంది…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త :
కుల మతాలకు వర్గ విభేదాలకు తావు లేకుండా పార్టీలకతీతంగా అర్హులైన నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెనుమంట్ర మండలం మార్టేరులో సోమవారం రూ.9.70 లక్షల వ్యయం తో నిర్మిస్తున్న బస్టాండ్ కు శంఖుస్థాపన చేసి అనంతరం సుమారు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాథ రాజు మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం బస్టాండ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం , ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా నిరాటంకంగా చేపట్టి పూర్తి చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకి, వైద్యానికి , సేద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పేద ప్రజల ను ఆదుకోవడం జరుగుతోందన్నా రు. గ్రామం లో వైద్యం అందుబాటులో ఉంచి ప్రజల ప్రాణాలు రక్షించేందుకు వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభివృద్ధి,సంక్షేమ ఫలాలను గ్రామంలోని ప్రతి కుటుంబానికి చేరువ చేసే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. జరిగింది అన్నారు. సంక్షేమ ఫ లాలను ప్రతి ఒక్క రికి అందించి, పాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు. రైతులకు ఎరువు లు పురుగుమందులు, విత్తనాలు అందుబాటులో ఉంచి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి చేరు వ చేసే విధంగా రైతు భరోసా కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి భూ సారానికి అనుగుణంగా పంటలు వేయడం ద్వారా వ్యవసాయాన్ని రైతులకు లాభసాటి చేసేలా ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రా లద్వారా సేవలు అందించనున్నా మన్నారు. గ్రామాల్లో అన్ని రోగా లకు చికిత్స అందించి మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసా మని గ్రామాల్లో అర్హు లైన వా రందరికీ సంక్షేమ ఫలాలను నేరుగా అందించేందుకు ప్రత్యేక సచవాల య వ్యవస్థను ఏర్పా టు చేశామ న్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా గ్రామం లో పాఠశాలలకు అన్ని మౌలిక వసతులు కల్పించా మన్నారు. గ్రామంలో అర్హత కల్గిన ప్రతీ లబ్దిదారునీ గుర్తించి లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసు కోవడం జరుగు తోంది అన్నా రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉన్న ప్పటికీ అన్ని వర్గాల సంక్షేమం దృష్టి లో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీలేని పోరాటం చేస్తూ నిధులను మంజూరు చేస్తు న్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తి విష్ణు కుమార్ రెడ్డి, కర్రి వేణుబాబు, కర్రీ గౌరీ సుభాషిని, బుర్ర రవికుమార్, గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి, వెలగల నారాయణరెడ్డి , చర్ల సత్యనారాయణ రెడ్డి, పెనుమంట్ర తాసిల్దార్ యడ్ల దుర్గా కిషోర్, హౌసింగ్ ఏఈ మల్లేశ్వరరావు వివిధ శాఖల అధికారులు వైయస్సార్ సిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *