Breaking News

నందిగామలో త్వరలోనే కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనాలు

-ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామలో కేంద్రీయ విద్యాలయం కు శాశ్వత భవనాల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా చేపడతామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని ) తెలిపారు. నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న భవనాలను, శాశ్వత భవనాలు నిర్మాణం చేయనున్న రాఘవాపురంలోని ప్రాంతాన్ని స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య తో కలిసి శనివారం ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) పరిశీలించారు.

ఈ సందర్భంగా ముందుగా తాత్కాలిక భవనాల ను పరిశీలించిన ఎంపీ చిన్ని ఆయా భవనాలలో సౌకర్యాలను ప్రిన్సిపల్ పంకజ్ ను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులకు అడ్మిషన్లు వస్తాయో వివరాలు తెలుసుకున్నారు.
ఫర్నిచర్, మరుగుదొడ్లు ఇతర సౌకర్యాల వివరాలు అడిగారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ….
నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యావకాశాలను మెరుగుపరిచేందుకు నందిగామలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభమైందన్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే సౌమ్య కృషి, సహకారం ఉందన్నారు. నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం పార్లమెంటులో సైతం మాట్లాడడం జరిగిందన్నారు. ఇవేమీ తెలియని కొంతమంది అజ్ఞానులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.
నందిగామ టిడిపి శ్రేణులు, ఎమ్మెల్యే సొంత నిధులతో తాత్కాలిక భవనాన్ని కేంద్రీయ విద్యాలయం కోసం ఏర్పాటు చేశారంటూ అభినందించారు.
త్వరలోనే కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో పోసిబాబు, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు, నందిగామ రూరల్ పార్టీ మండల అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి, ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిరుమామిళ్ల కృష్ణ, నందిగామ మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *