Breaking News

త్రాగునీటి పైప్ లైన్ లీకు మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే యుద్దప్రాతిపదికన పూర్తీ చేయాలి…

-కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో, బృందావన్ కాలనీ, శంకర్ విలాస్ సెంటర్ లో పంపింగ్ లైన్లపై ఏర్పడిన లీకుల మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే అంటే శనివారం ఉదయంలోపే పూర్తి చేసి, త్రాగునీటి సరఫరాని పునరుద్దరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిని దృష్ట్యా నగరంలో త్రాగునీటి సమస్య కొరత రాకుండా ఉండడానికి పైప్ లైన్ లీకుల మరమత్తులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. అందులో భాగంగా తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో, శంకర్ విలాస్ సెంటర్ లో పంపింగ్ లైన్లపై ఏర్పడిన లీకుల మరమత్తులు శనివారం నాటికి పూర్తీ అయ్యాయని, బృందావన్ కాలనిలోని లీకు మరమత్తుని శనివారం రాత్రికి పూర్తి చేయాలని స్పష్టం చేశామన్నారు. శనివారం ఉదయం పాక్షికంగా, సాయంత్రం నుండి యధావిధిగా సరఫరా చేయాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *