Breaking News

అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టాలి… : ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం , నేటి పత్రిక ప్రజావార్త :
బాపులపాడు మండలం మడిచర్ల గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అధికారులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన, మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. ఒకప్పుడు పొగాకు కు ప్రసిద్ధి చెందిన మల్లవల్లి, నేడు రాష్ట్రానికే తలమానికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. మీ బిడ్డల భవిష్యత్తు మారాలంటే పరిశ్రమలు రావడం ఎంతో అవసరమని ఆయన ఉద్ఘాటించారు. గ్రామాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని ఎజెండాగా పెట్టుకుని, ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే మూడవ స్థానంలో ఉందని, రాబోయే కాలంలో దీనిని ప్రథమ స్థానానికి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల్లోని సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు అందిన అర్జీలలో మెజారిటీ సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. అధికారులకు ప్రజల సమస్యల పట్ల బాధ్యత ఉండాలని, సమస్య పరిష్కారం కాకపోతే దానికి గల కారణాలను స్పష్టంగా వివరించాలని అధికారులను ఆదేశించారు. మడిచర్ల, కొయ్యూరు, కొత్తపల్లి, కొత్త మల్లవల్లి వంటి గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా గన్నవరంలో బీకాం కంప్యూటర్స్, బీటెక్ చదివిన విద్యార్థుల కోసం HCL కంపెనీతో కలిసి ‘AI ఫ్రీ ట్రైనింగ్’ వచ్చే నెల నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అశోక్ లేలాండ్ వంటి కంపెనీల ద్వారా సుమారు 920 మందికి, మొత్తం మీద నియోజకవర్గంలో 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ జోగేశ్వరరావు, తహసీల్దార్ మురళి కృష్ణ , గన్నవరం నియోజకవర్గ ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, బాపులపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, ఎన్.ఎస్.పి లెఫ్ట్ మెయిన్ కెనాల్ వైస్ చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ, వేములపల్లి శ్రీనివాసరావు, పిడికిటి రాంబాబు, మోటారు వాసు, దేవినేని సత్యనారాయణ, షేక్ జాన్ భాషా, తూమాటి సాంబశివరావు, ఆలూరి రామకృష్ణ, వి.ఎస్.ఆర్ కృష్ణ ప్రసాద్ (నాని), అక్కినేని ధర్మరాజు, కాకుమాను వెంకటేశ్వరరావు, వడ్డీ అశోక్, అక్కినేని కృష్ణాజీ, కాండ్రు అజయ్, అక్కినేని రవి, అక్కినేని కృష్ణాజీ, అవిర్నేని భవాని శంకర్, యంగ్ ప్రొఫెషనల్ పోతురాజు రాజేష్, మొవ్వ వేణుగోపాల్, కొల్లూరు చంద్రకాంత్, మాదల శ్రీనివాసరావు, కంపసాటి ప్రసాద్, బల్లమూడి కృష్ణ, కూకటి విజయ్ కుమార్, కొసరాజు సాయిరాం, బుస్సే నాగప్రసాద్, కొసరాజు సాయిరాం మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *