Breaking News

నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం పట్ల హర్షం

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను గన్నవరం ఎమ్మెల్యే మరియు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి వెళ్లిన ఆయన, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత శక్తివంతమైన రాజకీయ పక్షంగా తీర్చిదిద్దడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు టీడీపీ ద్వారా 1289 మంది ఎమ్మెల్యేలు, 149 మంది లోక్‌సభ సభ్యులు దేశానికి ప్రాతినిధ్యం వహించారని, 9 మంది కేంద్ర మంత్రులు, వందల సంఖ్యలో రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ మరియు శాసనమండలి సభ్యులను అలానే అనేక మంది ప్రజా నాయకులను దేశానికి అందించిన విశిష్ట గౌరవం తెలుగుదేశం పార్టీదే అని అన్నారు. దేశ ప్రధానుల, రాష్ట్రపతి ఎంపికలోనూ, అలాగే లోక్‌సభ స్పీకర్‌, గవర్నర్‌ పదవుల భర్తీలోనూ టిడిపి కీలక పాత్ర పోషించిన చరిత్ర ఉందని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు గారి మహత్తర దూరదృష్టితో 44 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన క్రమశిక్షణ, విజన్‌తో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారని యార్లగడ్డ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్‌ను 10 రెట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదేనని ఆయన గుర్తు చేశారు. అంకితభావంతో శ్రమించే కార్యకర్తలే టిడిపికి అసలైన బలమని, అలాంటి గొప్ప వారసత్వం మరియు విలువలున్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం ఒక గౌరవప్రదమైన మైలురాయి అని ఆయన అభివర్ణించారు. లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహించాలని యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *