-రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి..ముమ్మాటికీ సర్కారు ఓటమే
-ప్రధాని మోదీ రాజీనామా చేయాలి
-డీ లిమిటేషన్‌కు మద్దతిచ్చిన వారంతా ఏపీ ద్రోహులే
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పేరిట బీజేపీ ఎన్నికల డ్రామాలు ఆడిందని, దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు వంతపాడాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈ బిల్లు వీడిపోవడం బీజేపీ కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు. .డీ లిమిటేషన్‌కు ప్రత్యక్షంగాను, పరోక్షంగా ఎవరు మద్దతిచ్చినా..వారు ఆంధ్రప్రదేశ్ ద్రోహులేనని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఈశ్వరయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. అబద్దా కోరులు, కుట్ర దారులు రహస్య అజెండాతో పెట్టిన మహిళా బిల్లు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీడిపోవడం ముమ్మాటికీ సర్కారు ఓటమేనని పేర్కొన్నారు. దక్షిణాదిని రాజకీయంగా ఖూనీ చేసి ఉత్తరాది వాడికి బానిసలుగా మార్చాలని చూసిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో కుక్క చావు చచ్చిన తరహాగా మారిందన్నారు. జనాభాను కంట్రోల్ చేసినందుకు మన సీట్లు తగ్గించి, హిందీ వాళ్ల పెత్తనం పెంచాలనుకున్న నీచమైన కుట్రను తిప్పికొట్టారన్నారు. రాజ్యాంగ సవరణకు ఉండాల్సిన 2/3 మెజారిటీ లేక 290 ఓట్ల దగ్గరే ఆగిపోయి..కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పరువు బజార్లో పడిందన్నారు. మన కష్టాన్ని దోచుకుంటూ, మన గొంతు నొక్కాలని చూసే ఏ నా కొడుక్కైనా ఇదే గతి పడుతుందని ఈ ఓటింగ్ నిరూపించిందని తెలిపారు. ఇది దక్షిణాది ఆత్మగౌరవానికి దక్కిన విజయం, ఆ అహంకారపు ప్లాన్‌కు పడిన గట్టి చెప్పుదెబ్బ అని, ఇంకోసారి మన జోలికి వస్తే ఎలా ఉంటుందో ఈ ఫలితం ఆ వెధవలకు కళ్లకు కట్టినట్లు చూపించిందన్నారు.
జనగణనలో కులగణణ జరగాలని, ఆ కుల ప్రాతిపదికన వివరాలు సేకరించకుండా ఈ బిల్లులు కార్యరూపం దాల్చలేవని తెలిసినప్పటికీ..త్వరలో జరగబోయే ఎన్నికలను ద ష్టిలో ఉంచుకుని బీజేపీ రాజకీయ స్వార్థంతో ఈ డ్రామాలకు ప్రయత్నించిందని తెలిపారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండో వంతు మెజార్టీ సాధించలేకపోయిందని పేర్కొన్నారు. దీంతో మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లులూ ఆమోదం పొందలేకపోయాయని పేర్కొన్నారు. వాటికి మోదానికి దాదాపు 69 నుంచి 70 సీట్లు తక్కువుగా ఉన్నాయన్న విషయం..ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ నేతలకు ముందస్తుగా తెలిసినప్పటికీ, మహిళల రిజర్వేషన్ల ముసుగులో వారిని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, కేరళలో జరగబోయే ఎన్నికల్లో లబ్దికోసమే ఈ ప్రయత్నాలకు బీజేపీ ఒడిగట్టిందన్నారు. దానికితోడుగా సీఎం చంద్రబాబు..ఈ బిల్లు చారిత్రాత్మకమంటూ విపక్షాలకు లేఖలతో హడావుడీ చేశారన్నారు. కనీసం రాష్ట్రంలోని మిగిలిన రాజకీయ పార్టీలతో చంద్రబాబు సంప్రదించకుండా, అఖిలపక్షం సమావేశాలు వేయలేదన్నారు. నాడు సీపీఐ నేత త్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కావాలని పార్లమెంట్ వేదికగా బిల్లుకు ప్రయత్నించగా..నాడు బీజేపీ ఎంపీ ఉమాభారతిని ముందు పెట్టి..బీజేపీ అడ్డుకుందన్నారు. మహిళా బిల్లుపై బీజేపీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, ఇది కేవలం మహిళలను మభ్యపెట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల దండుకునే కార్యక్రమేనని పేర్కొన్నారు.ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జనగణనలో కులగణన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News