Breaking News

విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో KDCC బ్యాంక్ చలివేంద్రం ప్రారంభం

– కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC) చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘు రామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC Bank) ఆధ్వర్యంలో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం బ్యాంక్ ధ్యేయమని తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడకుండా చలివేంద్రాల ఏర్పాటు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. KDCC బ్యాంక్ రైతులు, మహిళలు, గ్రామీణాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా అదే దిశలో కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు జనరల్ మేనేజర్ N రంగబాబు బ్రాంచ్ మేనేజర్ జి సోమయ్య ఇతర ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *