Breaking News

అన్న క్యాంటీన్‌లో ముఖ్యమంత్రి దంపతుల అల్పాహారం

-జన్మదినం సందర్భంగా పటమట అన్న క్యాంటీన్‌కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సోమవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నగరంలోని పటమట అన్నక్యాంటీన్‌కు వెళ్లి అల్పాహారం తీసుకోనున్నారు. ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన సతీమని నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్‌ల ఒక రోజు ఖర్చు రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో రేపు ఉచితంగా ఆహారం అందించనునన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నక్యాంటీన్లలో మూడు పూటలా సోమవారం అన్నదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి కూడా తన పుట్టిన రోజు సందర్భంగా సతీమణి భువనేశ్వరితో కలిసి పటమట హైస్కూల్ రోడ్డులోని రైతు బజార్ దగ్గర ఉన్న అన్నక్యాంటీన్‌లో అల్పాహారం తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్లలో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వనున్నారు.

రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో పేదలకు గౌరవంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం చంద్రబాబు  పుట్టిన రోజు (ఏప్రిల్ 20) సందర్భంగా రూ.76 లక్షలు విరాళంగా అందివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందచేస్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే వేరే సంతృప్తి ఉండదు. అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఇంతకన్నా మంచి బహుమానం కూడా ఏమీ ఉండదు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *