Breaking News

మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా అదనపు కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ భారతీయ తత్వవేత్త, కవి, లింగాయత సామాజిక సంస్కర్త అని, ఆయన శివుడిని కేంద్రంగా చేసుకున్న భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని, కళ్యాణి చాళుక్యులు మరియు కలచూరి వంశాల పాలన కాలంలో జీవించారని, బసవేశ్వర తన కవిత్వం ద్వారా సామాజిక చైతన్యాన్ని వ్యాప్తి చేశారని, లింగభేదం, సామాజిక వివక్ష, మూఢనమ్మకాలు మరియు ఆచారాలను తిరస్కరించారని అన్నారు. భావితరాలకు మహాత్మా బసవేశ్వర జీవితం ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఇటువంటి మహనీయుల గురించి తమ పిల్లలకు తెలిపి వారికి చైతన్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపాల కృష్ణ, ప్రభాకర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, బయాలజిస్ట్ కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *