Breaking News

ప్రజా సమస్యలపై సిపిఐ దశలవారీ పోరాటం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ నిర్ణయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఈ రోజు విజయవాడ దాసరి భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శులు కె.రామకష్ణ, పల్లా వెంకటరెడ్డిలు మాట్లాడుతూ మహిళాబిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలనే కుట్రకు మోడీ, అమిత్‌షా తెరలేపారన్నారు. మోడీ సర్కార్ కుయుక్తులను పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా తిప్పికొట్టడం అభినందనీయమని అన్నారు. 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లును అమలు చేయకుండా, మరోసారి మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం దుర్మార్గమన్నారు. 2023 సెప్టెంబర్‌లోనే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో అడ్డంకులు సష్టించడం మోడీ సర్కార్‌కు తగదన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలో ఈ అంశంపై స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు మౌనం వహిస్తున్నాయని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో స్పష్టమైన అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నప్పటికీ, రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్‌లు ఎందుకు స్పందించడం లేదంటూ సూటిగా ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. మోడీ ప్రభుత్వానికి మహిళలపట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రస్తుతమున్న 543 పార్లమెంట్ స్థానాలలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదాను సుప్రీంకోర్టు నిరాకరించడంపై పున:సమీక్ష జరపాలని కోరారు.
రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వ అనాలోచిత విధానాలకు మద్దతునిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్ప్పున ఇళ్లస్థలాలు ఇవ్వడంలో, టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు కేటాయించడంలో తాత్సార వైఖరి అవలంభించడం విచారకరమన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం మూడో దశ భూసమీకరణ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైందికాదనీ; ఇప్పటికే సమీకరించిన భూమిలో అభివద్ధి చేపట్టకుండా, లక్ష ఎకరాలలో రాజధాని కడతామని చెప్పడం ‘నేల విడిచి సాము చేయడమే’నని వ్యాఖ్యానించారు. భూ బ్యాంకు అనే పేరుతో పేదల భూములను తీసుకుని, బడా కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లపై ఈ నెల 22న మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశానికి సిపిఐ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో జనగణనలో కులగణన కూడా చేపట్టాలని, ఆ ప్రాతిపదికన స్థానిక సంస్థలలో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడంపై ప్రత్యేక దష్టిపెట్టకుండా, కొత్త సాగునీటి పథకాలను గురించి ఆలోచించడం తగదన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలెదుర్కొంటున్న పలు సమస్యలపై దశలవారీ పోరాటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం రూపకల్పన చేసినట్లు తెలిపారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కోసం, పేదల ఇళ్లస్థలాల సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో చర్చా వేదికలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నిర్ణయించిందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *