Breaking News

76 ఏళ్ల వయసులో కూడా నిత్యవిద్యార్థి చంద్రబాబు

-ముందు చూపు కలిగిన గొప్ప పరిపాలనాదక్షుడు
-సీఎం జన్మదిన వేడుకల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులో కూడా నిత్య విద్యార్థిగా కొత్త విషయాలు ఆసక్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కొనియాడారు. అమరావతిలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను చైర్మన్ పట్టాభిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, రాష్ట్రం, దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి గురించి ఆయన నిరంతరం ఆలోచన చేస్తుంటారన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను అంచనావేయగల సామర్థ్యం కలిగిన గొప్ప పరిపాలనాదక్షుడన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంప్యూటర్ విప్లవం తీసుకువచ్చారని, ఆయన ప్రతిభకు తార్కాణమే హైదరాబాద్ అభివృద్ధి, సైబర్ సిటీ నిర్మాణం అని గుర్తు చేశారు. ఇప్పటికీ 76 ఏళ్ల వయసులో ఆయన క్వాంటమ్ వంటి ఆధునిక టెక్నాలజీ గురించే ఆలోచనలు చేస్తుంటారని చెప్పారు. చంద్రబాబు నాయుడు నిర్వహించే రివ్వ్యూ సమావేశాలలో అనేక అంశాలను ప్రస్తావిస్తారని, ఆ సమావేశాల్లో పాల్గొన్నవారు కొత్త కొత్త విషయాలు తెలుసుకొని స్ఫూర్తి పొందుతారన్నారు. తాను కూడా ప్రతి సమావేశంలో ఏదోఒకటి తెలుసుకుంటానని, పాజిటివ్ ఎనర్జీ పొందుతానని చెప్పారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివి వారి గురించి తెలుసుకోవడంతోపాటు ఏదో ఒకటి నేర్చుకోవాలన్నారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు, నారా లోకేష్ … వంటి వారి నుంచి మనం ఎన్నో తెలుసుకోవచ్చని చెప్పారు.

చంద్రబాబు ప్రాధాన్యతల్లో స్వచ్ఛ ఆంధ్ర ఒకటి

చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఒకటని, నెలలో ఒక రోజు ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలకు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే కొద్ది నెలల్లోనే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ఫలవంతం కావాలని, ఫలితాలు కనిపించాలన్నది ఆయన ఆకాంక్ష అని చెప్పారు. చంద్రబాబు నాయుడు వంటి పాలనాదక్షుడు, దార్శనికుడు సారథ్యంలో పనిచేయడం మనందరి అదృష్టం అని పట్టాభిరామ్ అన్నారు. మొన్న జరిగిన సీఎం రివ్వ్యూ సమావేశం కూడా రెండు గంటలు జరిగిందని, పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పారన్నారు. అటువంటి నేత నాయకత్వంలో మనందరం కృషి చేసి వచ్చే జన్మదినానికి మనం అనుకున్న ప్రాజెక్టులు సమర్థవంతంగా పూర్తిచేయాలని పిలుపు ఇచ్చారు.

76 ఏళ్ల యువకుడు చంద్రబాబు : గొట్టుముక్కల

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల యువకుడని, ఆయన పనితీరుని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సలహా కమిటీ చైర్మన్‌ గొట్టుముక్కల రఘురామ రాజు ప్రశంసించారు. రాష్ట్రం స్వచ్ఛంగా ఉండాలన్నది ఆయన లక్ష్యం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్న ప్రతి చోట ఆయనను ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా ఓ తాత్వికుడుగా, స్ఫూర్తి ప్రదాతలా చూస్తారన్నారు.

ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కేక్ కట్ చేశారు. కార్పోరేషన్ సిబ్బంది సీఎం చంద్రబాబుకు హ్రుదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రఘురామ రాజుకు చైర్మన్ పట్టాభిరామ్ కేక్ తినిపించారు. తర్వాత కార్పోరేషన్ అధికారులకు కేక్ అందించారు. ఈ వేడుకల్లో కార్పోరేషన్ జేడీ భాగ్యలక్ష్మి, సీఓఓ దశరథ రామిరెడ్డి, ఈడీలు ఊర్మిళ, ఈఈ సుహాసిని, ఎఫ్ఎం విజయశేఖర్, డీఈలు జయదేవ్, హేమలత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *