Breaking News

గన్నవరంలో ఘనంగా సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు

-ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
-మర్లపాలెంలో రూ.74 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు గన్నవరం నియోజకవర్గం మర్లపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం 76 కిలోల భారీ కేక్‌ను కూటమి నాయకులతో కలసి కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్లపాలెం వద్ద రూ.74 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే, గతంలో వివాదాలతో నిలిచిన గన్నవరం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఐటీ రంగానికి పునాది వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు . బిల్ గేట్స్ వంటి ప్రముఖులు కూడా చంద్రబాబు ప్రతిభ ను మెచ్చుకున్నారని పేర్కొన్నారు. క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులను అమరావతి తో పాటు గన్నవరం మేధా టవర్స్ కు తీసుకువచ్చారని తెలిపారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, గన్నవరం ఏ.యం.సి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, టిడిపి నాయకులు దయాల రాజేశ్వరరావు, గూడపాటి తులసిమోహన్, కొలుసు రవీంద్ర, గొడ్డళ్ల చిన్న రామారావు, జాస్తి శ్రీధర్, మూల్పురి సాయి కళ్యాణి, దొంతు చిన్నా, మొవ్వ వెంకటేశ్వరరావు, పొదిలి లలిత, కంభంపాటి లక్ష్మీనరసమ్మ, జొన్నలగడ్డ సుధాకర్, గండేపూడి నితీష్, బెజవాడ నాగేశ్వరరావు, బోడపాటి రవి, మేడేపల్లి రమ, మోదుగుమూడి సత్యనారాయణ, గుజ్జర్లపూడి బాబురావు, సర్నాల బాలాజీ, బుస్సే నాగప్రసాద్, తుమ్మల లత, నెక్కంటి శ్రీదేవి, గరికపాటి నాగలక్ష్మి, బుస్సే సరిత, తులిమెల్లి ఝాన్సీ, కానూరి శేషు మాధవి, చిమట రవివర్మ, షేక్ ఫిరోజ్, చల్లగుల్ల సందీప్, పరుచూరి నరేష్, కొసరాజు సాయిరాం, గండికోట సీతయ్య, కొల్లా ఆనంద్, అడుసుమిల్లి నవీన్, అన్నే హరికృష్ణ, తంగిరాల శ్రీనివాసరావు, చిన్నాల లక్ష్మీనారాయణ, కొమ్మారెడ్డి రాజేష్, సందీప్, అరికట్ల రవి, యనమదల సతీష్, బండి భాస్కర్, మల్లారెడ్డి కిషోర్ మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *