Breaking News

డా. పసుపులేటి హరిప్రసాద్‌కి జన్మదిన శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా చైర్మన్, రాష్ట్ర పిఎసి సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ తెలియని వారు తిరుపతి పరిసర ప్రాంతాలలో లేరనటంలో సందేహం లేదు. తిరుపతిలో సుమారు 20 సంవత్సర క్రితం బోత్ (బాలాజీ ఆర్థోపెడిక్ & ట్రామా హాస్పిటల్) హాస్పిటల్ స్థాపించి ఎంతో మందికి తన వైద్య వృత్తిద్వారా సేవలు అందించి గుర్తింపుపొందిన వారు మన సామాజికవేత్త డా. పసుపులేటి హరిప్రసాద్, ఎంఎస్ ఆర్థో, ఎంసిహెచ్ ఆర్థో వైద్యులు. ఈయన ఒక్కరోజులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా చైర్మన్, రాష్ట్ర పిఎసి సభ్యులు, నాయకుడుగా ఎదగలేదు. ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ప్రజలలో మమేకమైన వారి సాధక బాధలలో నేనున్నానని తనవంతు సహాయ సహకారాలు అందించిన వారు డా. పసుపులేటి హరిప్రసాద్. అటువంటి ప్రజానాయకుడు కాబట్టి జనసేనాని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో బాధ్యతలు అప్పగించారు. అనంతరం మరో మైలురాయి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా చైర్మన్‌గా సముచిత స్థానం కల్పించారు. తనమీద నమ్మకంతో తనకు అప్పగించి బాధ్యతలో భాగమైన అటు చేతివృత్తిదారుల అభివృద్ధికి, సాంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకైన హస్తకళారంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా చైర్మన్, రాష్ట్ర పిఎసి సభ్యులు, సామాజికవేత్త డా. పసుపులేటి హరిప్రసాద్‌కి జన్మదిన శుభాకాంక్షలు…

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *