Breaking News

అత్యంత వైభవంగా కుంభాభిషేక కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అహోబిలం సమీపంలో జ్వాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో, శ్రీధర్ గురూజీ పీఠాధిపత్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 18 అడుగుల ఏకశిల శ్రీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ, పన్నెండు అడుగుల లక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఆశ్రమ ఆవరణంలో తొమ్మిది రూపాలలో నరసింహస్వామి ఆలయాలు నిర్మించి, వాటి ప్రతిష్ఠలు కూడా ఈరోజే జరిపారు. అదేవిధంగా జనార్ధన స్వామి ఆలయం నిర్మాణం పూర్తిచేసి ప్రతిష్ఠ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయం అహోబిలం నరసింహస్వామి దేవాలయానికి పడమర వైపు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ సోదరులు వెంకటేశ్వర ప్రసాద్, శివ ప్రసాద్ కార్యక్రమ విశిష్టతను కొనియాడారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, దైవానుగ్రహం కలిగేలా ఈ ఆశ్రమం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *