గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని సుస్థిర, ఆధునిక మరియు ప్రజలకు అనుకూలమైన నగరంగా రూపుదిద్దే దిశగా ఒక కీలక ముందడుగు వేస్తున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో శ్రీవత్స కన్సల్టెంట్స్ సిఈఓ మరియు ఉదార్ ఫౌండేషన్ ఛైర్మన్ కిరణ్ భమిడిపాటి కలిసి గుంటూరు నగరం అర్బన్ రిజువనేషన్ మాస్టర్ ప్లాన్ పై విపులంగా మ్యాప్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, పబ్లిక్ స్పేస్‌ల కొరత మరియు పర్యావరణ సవాళ్లను అధిగమించడానికి అర్బన్ రిజువనేషన్ మాస్టర్ ప్లాన్ వంటివి దోహదపడతాయన్నారు. ఈ ప్లాన్ కేవలం భూ వినియోగానికే పరిమితం కాకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్, నీటి వనరుల సంరక్షణ, ఆర్థిక కార్యకలాపాల పెంపు మరియు నగర గుర్తింపుని మెరుగుపరిచేలా ఉంటుందన్నారు. నగరాన్ని సోషియల్, ఫిజికల్, ఎకానమీ మరియు కల్చరల్ అంశాల సమన్వయంతో అభివృద్ధి చేయడం ద్వారా వచ్చే 5 నుండి 10 సంవత్సరాలలో స్పష్టమైన మార్పు తీసుకురావచ్చన్నారు. శ్రీవత్స కన్సల్టెంట్స్ ఈ ప్రణాళిక ద్వారా గుంటూరు నగరానికి అవసరమైన సమగ్ర డయాగ్నస్టిక్ స్టడీ, ప్రాజెక్టుల గుర్తింపు, ఆర్థిక వ్యూహం మరియు అమలు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారని, త్వరలో రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) చేస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News