విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2025-2026 ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ళో అత్యధికంగా వసూలు చేసిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో అత్యధిక పన్ను వసూళ్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్ పురస్కారం అందించారు. గురువారం సాయంత్రం స్కూల్ అఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, జయప్రకాష్ నగర్, విజయవాడలో నిర్వహించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, రాష్ట్రస్థాయి మున్సిపల్ కమిషనర్ల వర్క్‌షాప్‌లో ఈ పురస్కారాన్ని ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్ ప్రదానం చేసి సన్మానించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ఈ పురస్కారం వీఎంసీ సిబ్బంది సమిష్టి కృషికి ప్రతిఫలమని తెలిపారు. నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలందించడానికి పన్ను వసూళ్లు కీలకమని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాగ నరసింహారావు, విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి.సృజన, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News