Breaking News

చదువు జీవితాన్ని మార్చే శక్తి.. కృషి, పట్టుదలతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు : విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి గన్నవరం బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు . మాజీ సర్పంచ్ పాలడుగు వెంకట వరప్రసాద్ (నాని) సహకారంతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు. బైపిసి విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం సాధించిన కేసరపల్లి చెందిన మోట్రు మౌనికకు రూ.25,000 బహుమతి అందించారు. కూచిపూడి ఐశ్వర్యకు రూ.10,000, ఎంపీసీ టాపర్ ఈలప్రోలు దివ్యకు రూ.10,000, జూనియర్ ఎంపీసీ టాపర్ సగ్గుర్తి మౌనికకు రూ.5,000 చొప్పున ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ కృషి, పట్టుదలతోనే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. చదువు జీవితం మార్చే శక్తి అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. కేసరపల్లిలో నిరుద్యోగ యువతకు ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ అందించమన్నామని, దీని ద్వారా మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని వివరించారు. అలాగే పరిశ్రమల ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సి డాక్ సెంటర్ ను గన్నవరానికి తీసుకురావడానికి ప్రయత్నాలు తుది దశ కు చేరుకున్నాయని వెల్లడించారు. పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను ఎమ్మెల్యే అభినందించారు. గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సునీల, ఉప విద్యాశాఖ అధికారి (గుడివాడ డివిజన్) కొండా రవికుమార్, ఎంఈవో – 2 కమలకుమారి, ఎస్.ఎం.సి చైర్మన్ సుచరిత, గన్నవరం ఏయంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, వైస్ ఎంపీపీ కొమ్మురాజు సుధీర్, మాజీ సర్పంచ్ పాలడుగు వెంకట వరప్రసాద్ (నాని), మాజీ ఏయంసి చైర్మన్ కోటగిరి వరప్రసాద్, మాజీ ఎంపీపీ తులిమిల్లి ఝాన్సీ, బోడపాటి రవి, బోయపాటి మురళీ కృష్ణ, మద్దినేని వెంకటేశ్వరరావు, మేడేపల్లి రమ, కొసరాజు సాయిరాం, అన్నే హరికృష్ణ, యనమదల సతీష్, అంకెం రామారావు, చిమటా రవివర్మ, మల్లారెడ్డి కిషోర్, కంభంపాటి కృష్ణ కిషోర్, కంచర్ల సూర్య, కూడారపు వెంకట కృష్ణ, కాగితాల నాగరాజు, మణిమాల వెంకట అప్పారావు, చిట్టినేని జోజి, సూరిబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *