Breaking News

5 శాతం రాయితీతో పన్ను చెల్లించడానికి 6 రోజులే గడువు కమిషనర్ మయూర్ అశోక్….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 6 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ అవకాశాన్ని కల్పించిందని, ఈ నెల 30లోపు ఆస్తి పన్నుని ఏక మొత్తంగా చెల్లిస్తే పన్ను రాయితీ లభిస్తుందని తెలిపారు. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీని కూడా ఈ నెలాఖరులోపు చెల్లించి పొందవచ్చని తెలిపారు. నగరంలోని ఆస్తి, ఖాళీ స్థలపన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఈ నెలాఖరు లోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా పన్ను సేకరణ క్యాష్ కౌంటర్లు సెలవు రోజులతో సహా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *