గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో అమృత్ పధకం క్రింద జరిగిన అభివృద్ధి పనులను అమృత్ డిప్యుటీ సెక్రటరీ గ్రేస్ లాల్ రెండికి పచావ్ ఐ.ఎ.యస్ పరిశీలించారు. ఈ సందర్భంగా నగర పరిధిలో అమృత్ పధకం క్రింద అంకిరెడ్డి పాలెం చెరువు మరియు కొరిటపాడు చెరువు లలో జరిగిన వివిధ అబివృద్ది పనులను శుక్రవారం నగర పాలక సంస్థ అధికారులతో కలిసి కేంద్ర అమృత్ బృందం పర్యటించి తనిఖీ చేశారు.
గుంటూరు నగరంలో అమృత్ పధకం క్రింద త్రాగు నీటి కుళాయిల ఏర్పాటు, పార్కులు మరియు చెరువు అభివృద్ధి పనులను నిర్వహించగా, సదరు పనులను పరిశీలించుటకు కేంద్ర పట్టణాభివ్రుద్ది శాఖ అమృత్ పధకం నుండి శుక్రవారం నగరానికి కేంద్ర బృందం నగరానికి వచ్చింది. సదరు బృందం 3.50 కోట్లతో అభివృద్ధి చేసిన అంకిరెడ్డి పాలెం చెరువును మరియు 3.70 కోట్లతో అభివ్రుద్ది చేసిన కోరిటపాడు చెరువులను పరిశీలించి, సదరు చెరువు అభివృద్ధి పనులను చూసి కేంద్ర బృందం సంత్రుప్తి చెంది, కొరిటపాడు పాడు చెరువు వద్ద గల డ్రైన్ వాటర్ ను శుద్ధి చేసి, మరల సదరు నీటిని చెరువులోకి మరల్చుటకు 70 లక్షలు అదనంగా నిధులు మంజూరు చేసి, పనులను వెంటనే ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
సదరు పర్యటనలో యస్.ఈ జి. వెంకటేశ్వర రావు, ఎ.పి.యు.యఫ్.ఐ.డి.సి ఇంజనీరింగ్ అధికారులు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News