విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం నందు ఈరోజు “ప్రపంచ మలేరియా దినోత్సవం” ఘనంగా నిర్వహించడం జరిగింది. 25/4/26 తేదీ వరల్డ్ మలేరియా డే సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ M. సుహాసిని మరియు జిల్లా మలేరియా ఆఫీసర్ D. రాజు నాయక్. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ, మన జిల్లాలో మలేరియా మీద నిరంతరం పోరాటం చేస్తూ, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ, ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి, వారందరూ పాటించే విధంగా చేస్తే ఈ మలేరియా ని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చినని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించి పూర్తి అవగాహనతో ముందుకు నడవాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డి యం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఇందుమతి దేవి, ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మాధవి నాయుడు, డిపిఎమ్ఓ డాక్టర్ నవీన్, డాక్టర్ సునీల్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ విద్యాసాగర్, మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Prajavartha Online Telugu News