-బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు సాధించిన సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు
-మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో సంస్కరణలకు ఆద్యుడు సీఎం చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు సాధించిన సీఎం చంద్రబాబుకు శనివారం నాడు పత్రిక ప్రకటనలో మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి డా.స్వామి మాట్లాడుతూ…బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు సాధించిన సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు. ఈ అవార్డు యావత్ తెలుగు జాతికి గర్వకారణం. దేశంలో సంస్కరణలకు ఆద్యుడు సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు ముందు చూపు, పాలనాదక్షత భేష్.
చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు దొరకడం తెలుగు నేల చేసుకున్న పుణ్యం.
సీఎం చంద్రబాబు సారథ్యంలో అభివృద్ధి, టెక్నాలజీలో రాష్ట్రం దేశంలోనే నెం.1 గా నిలవనుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
Prajavartha Online Telugu News