అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరు జిల్లాలోని పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ , ఆలయ పాలకమండలి ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి ఆహ్వానించారు. ఈనెల 27 నుంచి మే 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనం అందించి స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు. ఉత్సవాల ఏర్పాట్లను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News