Breaking News

రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుకి ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద రాజా వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడుకి ఘన నివాళులర్పించారు కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలను మాలలు అర్పించి సిబ్బందితో నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, అమరావతి ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గొప్ప పరిపాలకుడు మరియు దాతృత్వ గుణం కలిగిన నాయకుడని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, సామాజిక అభివృద్ధి కోసం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రజాసేవలో నిబద్ధతతో పని చేయాల్సిన అవసరాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చూపించిన మార్గం ద్వారా గ్రహించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఏ రవీంద్రరావు, డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ కే. సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్) సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, సూపర్డెంట్ ఇంజనీర్ (వర్క్స్) వి. చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ.శ్రీధర్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాల కృష్ణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డి.హరీష్, బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *