Breaking News

జూన్ నెలలో చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చిన ఫ్యాప్టో

-మూడు రోజుల నిరాహార దీక్షలు విజయవంతం!!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్యాప్టో 3వ రోజు నిరాహార దీక్ష శిబిరం నుంచి ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ జూన్ నెలలో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చినదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి నిరాహార దీక్ష శిబిరం నుండి ప్రకటన చేశారు. ఈరోజు 03వ రోజు నిరాహారదీక్షను ఫ్యాప్టో పూర్వపు సీనియర్ నాయకులు పి. కృష్ణయ్య ప్రారంభించారు.మరో ఫ్యాప్టో సీనియర్ నాయకులు సిహెచ్. జోసఫ్ సుధీర్ బాబు సాయంత్రం ఐదు గంటలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎల్.సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మద్యంతర భృతిని ప్రకటించాలని అదే మా ప్రధాన డిమాండ్ అని తెలియజేశారు. మున్సిపల్ టీచర్లకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, మోడల్ స్కూల్స్ సమస్యలను పరిష్కరించాలని, ఫ్యాప్టో ప్రతిపాదించిన డిమాండ్ల పైన చర్చించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారుఅదేవిధంగా స్థానిక సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలను చేపట్టకపోవడం దారుణమని అన్నారు. మే నెల 31వ తేదిలోపు సమస్యలు పరిష్కరించకపోతే జూన్ నెలలో ప్రత్యక్ష కార్యచరణకు ఫ్యాప్టో సిద్ధపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర కో-చైర్మన్ లు కె. నరహరి,కాకి ప్రకాష్ రావు, సిహెచ్ రమేష్, సిహెచ్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ లు ఎన్.వెంకటేశ్వర్లు, కే బసవలింగారావు, జి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు ఎం రఘునాధ రెడ్డి, సిహెచ్ మంజుల, జి. హృదయ రాజు, ఎండి మోహిదీ, కే రాజేంద్ర బాబు, తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఫ్యాప్టో శిబిరం నుండి అల్టిమేటం తెలియజేశారు.

ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు కోసం ఫ్యాప్టో సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నదని కోర్టు పెండింగ్ లేని అంశాన్ని కూడా కోర్టు వివాదం నడుస్తున్నట్లుగా అధికారులు బూటకపు మాటలు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలో ఉపాధ్యాయ, ఉద్యోగులు లేరని అన్నారు.12వ వేతన సవరణ కాలం ప్రారంభమై 33 నెలల కాలం అయినప్పటికీ కనీసం వేతన సవరణ సంఘాన్ని కూడా నియమించలేదని అన్నారు. ప్రత్యేకించి పంచాయితీ రాజ్ యాజమాన్యంలో ప్రధానంగా రెండు డిమాండ్లు ఉన్నాయని మొదటిది ఏకీకృత సర్వీస్ రూల్స్, రెండవది కారుణ్య నియామకాల సమస్య అని అన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు 2017లో రాష్ట్రపతి ఉత్తర్వులను తీసుకొని రావడం జరిగిందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో భాగంగా 72,73,74 జి.ఓ లను విడుదల చేయడం కూడా జరిగిందన్నారు. అయితే 72,73 జి. ఓ లపై ఎలాంటి కోర్టు అభ్యంతరాలు లేకపోయినా అధికారులు అడ్డగోలుగా ప్రభుత్వ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ఈ సమస్యపై ఎంతవరకయినా ఫ్యాప్టో పోరాటం చేస్తుందని అన్నారు.

ఈరోజు నిరాహార దీక్షలో కడప,అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పల్నాడు, కృష్ణ, తూర్పుగోదావరి, అనకాపల్లి విజయనగరం జిల్లాల నుండి చైర్మన్ మరియు సెక్రటరి జనరల్స్, ఉపాధ్యాయులు హాజరై సంఘీభావం తెలియజేశారు.

సామ్రాజ్య వాదం నశించాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి- ఫ్యాప్టో!!

ఫ్యాప్టో మూడవరోజు నిరాహారదీక్ష ముగిసిన అనంతరం కార్యకర్తలందరూ సామ్రాజ్యవాదం నశించాలి – ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని బ్యానర్ ప్రదర్శన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుందని వెంటనే యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచాధిపత్యం కోసం చేసే యుద్ధంలో అమాయక ప్రజలు చనిపోతున్నారని, ఈ యుద్ధం వల్ల ధరలు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రత్యక్షంగా గురి అవుతున్నారని, వెంటనే ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *